అత్యంత పాశవికంగా హత్యకు గురైన ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు మానవ మృగాలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే చేదించారు. నారాయణపేట జిల్లాకు చెందిన పాషా అనే వ్యక్తి ఈ కేసు లో ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మీడియా లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఇంకా అధికారీకంగా నిర్ధారించలేదు.

 

అయితే తమ కూతురు మృతికి పోలీసులే కారణం అంటూ ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. " రాత్రి 9.30 గంటలకు మా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. గంట సేపు ప్రియాంక ఫోన్ లిఫ్ట్ చేస్తుందేమో అని చూసాం కానీ ఎంతకీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో 11 గంటలకు పోలీసులకు పిర్యాదు చేసాం. పోలీసులు సీసీ టీవీ ఫుటేజు పరిశీలించారు. ప్రియాంక రెడ్డి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి కానీ అటు నుంచి వచ్చినా దృశ్యాలు మాత్రం సీసీటీవీ లో కనిపించలేదు. వెతకాల్సింది పోయి చూసిన సీసీటీవీ నే పదే పదే చూస్తూ సమయం వృధా చేశారు. పోలీసులు వెంటనే స్పందించి తమ కూతురు ఆచూకీ కోసం వెతికితే తప్పకుండా ప్రాణాలతో బయటపడేది. పోలీసులను చూస్తుంటే మానవత్వం చనిపోయింది అని అనిపిస్తోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా స్పందించని పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతానని శ్రీధర్ రెడ్డి చెప్పారు.

 

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరుపై ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీయార్ ఈ కేసు పై స్పందించి, తను ఈ కేసు ను స్వయంగా మానిటర్ చేస్తామని చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష అమలు అయ్యేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: