దూరప్రయాణాలు చేసేవారికి టోల్ గేట్లవద్ద జాం ఐయ్యే ట్రాఫిక్‌తో తలనొప్పులు వస్తుంటాయి. ఇక నుండి టోల్‌గేట్ దగ్గర ఇలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానాన్ని కేంద్రం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని డిసెంబర్ 1 నుంచి టోల్ గేట్ల దగ్గర అమలు చేసేలా ఇప్పటి  నుండే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇకపోతే డిసెంబర్ 1 నుంచి ప్రతీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మారుతుంది.. లేకపోతే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది.

 

 

ఇక ఈ ఫాస్ట్ ట్యాగ్ కొనడానికి అనేక ఆప్షన్లు ఉన్నాయి. టోల్ ప్లాజాల దగ్గర్నుంచి బ్యాంకుల వరకు ఎక్కడైనా ఫాస్ట్ ట్యాగ్ కొనొచ్చు. ఇక పేటీఎం ఇంటికి ఫ్రీగా ఫాస్ట్ ట్యాగ్ డెలివరీ చేస్తోంది. అంతేకాదు  ఫాస్ట్ ట్యాగ్ ధరను రూ.100 తగ్గించింది. అంటే మీరు రూ.400 చెల్లిస్తే చాలు మీ ఇంటికే ఫాస్ట్ ట్యాగ్ ఉచితంగా వస్తుందన్న మాట.. అందులో రూ.250 సెక్యూరిటీ బ్యాలెన్స్ కాగా, రూ.150 మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుంది.

 

 

ఇకపోతే ఫాస్ట్ ట్యాగ్ ను మీరు పేటీఎం యాప్‌లో కొనొచ్చు. ఇందుకుగాను చేయవలసిన పని ఏంటంటే పేటీఎం యాప్‌లో మీ వివరాలు ఎంటర్ చేసి ఫాస్ట్ ట్యాగ్ కొనాలి. మీకు ఫాస్ట్ ట్యాగ్ డెలివరీ చేసిన తర్వాత ఆర్‌సీ లాంటి డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు. ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ అవుతుందని తెలుపుతున్నారు.. ఇదే కాకుండా పేటీఎంలో ఫాస్ట్ ట్యాగ్ కొన్న తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ప్లాజాల దగ్గర ట్రాన్సాక్షన్స్ చేస్తే 2.5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఉచితంగా సినిమా టికెట్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది.

 

 

అంతేకాదు... కార్పొరేట్ ఆఫీస్‌లతో కలిసి కార్యాలయాల దగ్గర హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయబోతోంది పేటీఎం. ఆ కంపెనీ ఉద్యోగులంతా అక్కడే ఫాస్ట్ ట్యాగ్‌లు తీసుకోవచ్చు. అంతే కాకుండా ఒకవేళ మీ ఫాస్ట్ ట్యాగ్‌లో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత పేటీఎం వ్యాలెట్ నుంచి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చూ.. ఈ విధానం వల్ల ప్రయాణంలో కొంతవరకు సమయం ఆదా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: