డాక్టర్ ప్రియాంక రెడ్డి.. నిన్నటి నుండి ట్రెండ్ అవుతున్న సంఘటన. ట్రెండ్ అవ్వడం కాదు ఈ ఘటన విన్న ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు. అయితే అత్యంత దారుణంగా ఆమెని చంపడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. 

 

దీంతో పదిహేను బృందాలుగా ఏర్పడి హత్య చేసిన నిందితులను పోలీసులు చివరికి ఛేదించారు. కేవలం 24 గంటల్లో ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియాంక రెడ్డిపై నలుగురు లారీ డ్రైవర్, క్లినర్ కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా నిర్దారించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక రెడ్డితో టైర్ పంక్చర్ డ్రామా ఆడినట్టు పోలీసులు గుర్తించారు. మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని పోలీసులు తేల్చి చెప్పారు. 

 

అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్యానంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు ఆ తర్వాత మృతదేహాన్ని అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పడేశారు. అనంతరం అక్కడ నుండి ఆ దుండగులు అందరూ జారుకున్నారు. ఇంత దారుణంగా జరిగింది.. 

 

కానీ పోలీసులు.. మా అమ్మాయి కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే.. ఎవడితో లేచిపోయిందో ఎవడికి తెలుసు ? అని నీచమైన పదజాలంతో మాట్లాడారట.. ఈ మాటలు చూస్తుంటే పూరి జగన్నాద్ సినిమా గుర్తొస్తుంది. అందులో పోలీసులు ఎలా ప్రవర్తించారో.. ఇక్కడ పోలీసులు అలానే ప్రవర్తించారు. కూతురు కనిపించక తల్లిదండ్రులు బాధపడుతుంటే.. ఆ తల్లిదండ్రులను ఆ చెత్త మాటలతో మానసికంగా కుంగిపోయేలా చేశారు అని వారు మీడియా ముంద వాపోయారు. 

 

ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై నెటిజన్ల నుంచి పూనమ్ కౌర్ వరుకు అందరూ విరుచుకుపడుతున్నారు. అసలు మీరు పోలీసులేనా అలా అనడానికి కొంచము సిగ్గు ఉండాలి అంటూ పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. అంతే కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పలకు పోతున్న పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం చాలా సిగ్గు చేటు అంటూ నెటిజన్లు కూడా పోలీసులపై ఫైర్ అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: