కళ్లముందు నిలువెత్తురూపాలుగా కనపడుతున్న రాజధాని ప్రాంత నిర్మాణాలను గ్రాఫిక్స్‌తో పోల్చిన అధికారపార్టీనేతలకు అహంకారంతో నిజంగానే కళ్లు మూసుకుపోయాయని   ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎద్దేవాచేశారు. చంద్రబాబు పర్యటనలో చిత్రీకరించిన అమరావతి నిర్మాణాలను, రోడ్లను, ఇతరకట్టడాలను ఆయన విలేకరులకు ప్రదర్శించారు. చంద్రబాబు హయాంలో 90శాతానికి పైగా పూర్తయిన ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ క్వార్టర్స్‌కి, అఖిలభారత సర్వీస్‌ అధికారులగృహలకు, లెజిస్లేటివ్‌ భవనాలకు, రంగులుకూడా వేయలేని అసమర్థ స్థితిలో జగన్‌సర్కారు ఉందన్నారు. 
శ్మశానాలకు, పంచాయతీభవనాలు, పాఠశాలలకు, దేవాలయాలకు, అన్నక్యాంటీన్లకు పార్టీరంగులేయడానికి వందలకోట్లు దుర్వినియోగం చేసిన రాష్ట్రప్రభుత్వం, రాజధాని కట్టడాలకు సున్నాలేయడానికి ఎందుకు సంకోచిస్తోం దని దీపక్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజధాని నిర్మాణాలను గ్రాఫిక్స్‌ంటూ ఎద్దేవాచేశారని, ఆయనకు దృష్టిదోషం ఉందేమోనన్న అనుమానంతో తెలుగుదేశంపార్టీ తరుపున వారింటి అడ్రస్‌ప్రకారం బేతంచర్లకు కళ్లద్దాలు పంపుతున్నామన్నారు. 
తాము పంపిన కళ్లద్దాలు పెట్టుకొనిచూస్తే, మంత్రికి అమరావతి నిర్మాణాలు కనిపిస్తాయని, కళ్లజోడుకి రెండేళ్లవారంటీకూడా ఉన్నందున మంత్రి దిగులుపడాల్సిన పనిలేదని దీపక్‌రెడ్డి చురకలంటించారు. వైసీపీ 6నెలలపాలనలో ప్రతిపక్షాలు, మీడియా గొంతునొక్కడం తప్ప సాధించిందేమీలేదన్నారు. చంద్రబాబు పర్యటనను ఉద్దేశించి డీజీపీ చేసిన వ్యాఖ్యలు, మేమైతే చంద్రబాబుని కొట్టిఉండేవాళ్లమంటున్న మంత్రుల మాటలు రాష్ట్రప్రభుత్వ వైఖరికి అద్దంపడుతున్నాయన్నారు. వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనంచేసేలా, అధికారపార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, డీజీపీ వారికన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నా డన్నారు. తెలుగుదేశంశ్రేణులపై జరిగిన వందలకొద్దీదాడులకు సంబంధించి సాక్ష్యాలను చూపినా కూడా పోలీసులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్‌ లక్ష్మణ్‌ చెప్పినట్లుగా కొందరు కార్టూన్లే రాజకీయనాయకులుగా ప్రవరిస్తున్న ఉదంతాలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు.
చంద్రబాబుపై దాడిచేసింది పక్కనియోజకవర్గాలకు చెందిన కిరాయి వ్యక్తులని, వైసీపీనేతలు, పోలీసుల ప్రోద్భలంతోనే దాడి జరిగినట్లు సాక్ష్యాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, నిందితులపై చర్యలు తీసుకోవడానికి డీజీపీ సిద్ధంగా ఉన్నాడా అని దీపక్‌రెడ్డి పత్రికాసమావేశంలో నిలదీశాడు. వైసీపీనేతలు వేటకుక్కల్లా ప్రతిపక్షంపై దాడిచేస్తూ, వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చేయడానికి వ్యక్తిగతదూషణలకు పాల్పడుతున్నారని ఆయన స్పష్టంచేశారు. రాచరిక పోకడలతో, పాలెగాళ్లలా వ్యవహరిస్తున్న పాలకులు,  తప్పులతో ఎక్కువకాలం మనుగడ సాగించలేరన్నారు.  తామైతే చంద్రబాబుని కొట్టేవాళ్లమన్న మంత్రులవ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైనా, చర్యలు తీసుకోలేని స్థితిలో డీజీపీ ఉన్నాడన్నారు.. టీడీపీప్రభుత్వ హాయాంలో రూ.41,678కోట్ల విలువైన పనులు ప్రారంభమైతే, రూ.9వేలకోట్ల విలువైన పనులుపూర్తయ్యాయని, ఆయానిర్మాణాలకు రంగులుకూడా వేయలేని హీనస్థితిలో అధికారపార్టీఉందన్నారు. ప్రతిపక్షనేత సలహాలు, సూచనలు స్వీకరించకుండా, తప్పొప్పులు సరిదిద్దుకోకుండా, ఎదురుదాడిచేస్తూ పాలనసాగించడం రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: