మహిళలపై అత్యాచారా పర్వం దేశంలో నిరభ్యంతరంగా కొనసాగుతుంది. కట్టుకున్న భార్య ఐనా, కాలు లేని అవిటి వారైనా, పాలు తాగే పసి పిల్లలైనా ఎవరెతేనేమి కామాంధుల కంట్లో పడితే జాలి, దయ లేకుండా కర్కశంగా అనుభవించి చంపేస్తున్నారు. ఇలా  కొన్ని చోట్ల కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. వరంగల్‌లో మానస, శంషాబాద్‌లో ప్రియాంక రెడ్డి ఘటనలపై తెలంగాణలో దుమారం రేగుతున్న వేళ.. యూపీలో మరో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఇక మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలు అమలు కాకపోవడం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పేరుతో సాగే ఆడ మగ వ్యత్యాసాలు, మత నమ్మకాల్లోంచి వచ్చిన అనాచారాలు, అజ్ఞానం, ఆడపిల్ల అంటే ఉన్న చిన్న చూపు, ఆమె అంటే ఉన్న నిర్లక్ష్యం ఇలా , కారణాలేవైనా కానీయండి..

 

 

ఆడపిల్ల పుట్టకముందే, లోకం పోకడ తెలియక ముందే తల్లి గర్భంలో ఉండగానే వివక్షతకు గురవుతోంది. అది ఆమె గిట్టే వరకూ కొనసాగుతూనే ఉంది. ఇకపోతే ప్రజలకు భద్రత కల్పించే ఓ మహిళ పోలీసుపైనే అఘాయిత్యానికి ఒడిగట్టారు రాక్షసులు. ఈ దురాగతాన్ని కానిస్టేబుల్ భర్తే మిత్రులతో కలిసి చేయించాడూ.. ఇక బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని కొత్వాలి ప్రాంతంలో భర్త హిమాంశుతో కలిసి ఓ మహిళా కానిస్టేబుల్ నివసిస్తోంది. ఆమె భర్త కూడా లక్నో సెక్యూరిటీ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

 

 

ఐతే పెళ్లైన కొన్ని నెలల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. తర్వాత అదనపు కట్నం విషయంలో భార్యభర్తల మధ్య తరచుగా ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో ఇటీవల ఆమె భర్త ఓ రోజు రాత్రి తన ముగ్గురు మిత్రులతో కలిసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ముగ్గురు కలిసి మద్యం తాగి అనంతరం మహిళపై అందరూ కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఇది ఎంత నీఛమైన ఘటన అంటే మనసమాజం నాశనమైంది అని చెప్పడానికి ఇంతకంటే వేరే దుర్మార్గం ఉందా? ఇక ఘటనపై బాధిత మహిళా సీతాపూర్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అతడి మిత్రులు, అత్తింటి వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ఐతే ఉన్నతాధికారులు మాత్రం ఇది చాలా పాత కేసని ఇంతకు ముందే తన భార్య తల్లిదండ్రులు, బంధువులు తనపై దాడి చేశారని హిమాంశు తమకు ఫిర్యాదు చేశాడని వారు చెబుతున్నారు. ఆ కేసు నమోదైన కొన్ని రోజులకే మహిళా కానిస్టేబుల్ గ్యాంగ్ రేప్ కేసు పెట్టినట్లు వెల్లడించారు. ఇకపోతే ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సీరియస్‌గా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: