ఫోన్.. అబ్బబా. ఈ కాలంలో దీని పిచ్చిలో మునిగి తేలుతున్నారు మనుషులు. తేలడం కాదు.. బానిసలవుతున్నారు. ఫోన్ లేకపోతే ఒక్క గంట కూడా గడవదు ఈ కాలం మనుషులకు.. ఇంకా ఫోన్ లేదు అంటే బాడీలో ఒక పార్ట్ లేదు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఈ కాలం ప్రజలు. అంత ఫోన్ పిచ్చిలో తెలుస్తున్నారు మనుషులు. 

 

అంత పిచ్చి ఎందుకు అంటే.. అందులో మెసేజులు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు అబ్బో ఒకటా ఏంటి ? అన్ని ఇప్పుడు ఆ ఫోన్ లోనే. అన్ని ఉన్న ఆ ఫోన్ ని చూస్తే ఏ మనిషైనా సరే వారి గురించి వారే మర్చిపోవాలి. అలాంటి ఈ ఫోన్ వల్ల రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రోడ్డు యాక్సిడెంట్లు అయితే మరి దారుణంగా జరుగుతాయి. 

 

ఈ నేపథ్యంలోనే ఓ ప్రయాణికుడు తృటిలో ప్రాణాన్ని రక్షించుకున్నాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. అర్జింటీనియాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి మంగళవారం ఉదయం అగ్వేరో డి-లైన్ రైల్వే స్టేషన్‌‌కు వెళ్లాడు. రైలు కోసం ఎదురుచూస్తున్న అతడు.. తన స్మార్ట్ ఫోన్ చూస్తే ప్లా్ట్‌ఫాం మీద నడిచాడు. ఫోన్ మాయలో పడి తాను ఎక్కడ నడుస్తున్నాడో కూడా మరిచిపోయాడు. 

 

దీంతో ఆలా నడుచుకుంటూ నడుచుకుంటూ.. నేరుగా ప్లాట్‌ఫాం మీద నుంచి ముందుకు నడిచి రైల్వే ట్రాక్ మీద పడ్డాడు. అయితే ఆ సమయంలో ట్రైన్ రాలేదు కాబట్టి బతికిపోయాడు. అయితే అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు అతడిని రైల్వే ట్రాక్ మీద నుంచి పైకి లాగి రక్షించారు. ఈ ఘటనలో అతడికి పెద్దగా గాయాలేవీ కాలేదు. కానీ ఆసుపత్రిపాలైతే అయ్యాడు. అందుకే కనీసం రోడ్డుపై ఉన్నప్పుడు అయినా ఫోన్ పక్కన పెడితే మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: