తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యువ వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లోనే చేధించారు. బుధవారం సాయంత్రం చికిత్స కోసం అంటూ మాదాపూర్ లోని హాస్పటల్ కు బయలు దేరిన ఆమె కొద్దిసేపటికే తన స్కూటీ టైరు పంక్చ‌ర్ అయింది అంటూ తన ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. చివ‌ర్లో అక్క‌డున్న లారీ డ్రైవ‌ర్ల‌ను చూస్తుంటే త‌న‌కు భ‌యం వేస్తోంద‌ని కూడా ఆమె సోద‌రికి ఏడుస్తూ ఫోన్‌లో చెప్పింది. 

 

ఆ వెంటనే ఫోన్ స్విచాఫ్ వ‌చ్చింది. అదే రోజు రాత్రి త‌న‌ కుమార్తె కోసం వెతికిన ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయమే ప్రియాంక డెడ్ బాడీ కాలిపోయిన స్థితిలో కనిపించింది. ప్రియాంక ఫిర్యాదు చేయగా కేసు తమ పరిధిలోకి రాదని వారు వాదింంచే ప్రయత్నం చేసినట్టు ఆమె తల్లిదండ్రులు ఆవేదనతో మీడియాకు చెబుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే కనీసం త‌మ కూతురు ప్రాణాల‌తో అయినా ద‌క్కేద‌ని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

 

ఇదిలా ఉంటే ప్రియాంక పై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు.. ఆమె డెడ్ బాడీని కాల్చేందుకు ఆమె స్కూటీ ఉపయోగించే పెట్రోల్ తెచ్చినట్టు స్పష్టమైంది. ప్రియాంకను నిర్బంధించిన తర్వాత ఆమె స్కూటీపైనే వెళ్లి నిందితులు కొత్తూరులో పెట్రోల్‌ కొనుక్కుని వెళ్లినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సైతం వెలుగులోకి వచ్చింది. 

 

పెట్రోల్ కొనుగోలు చేసిన అనంతరం నిందితులు కొత్తూరు నుంచి మళ్లీ షాద్‌నగర్‌ వైపు వెళ్లారు. ప్రియాంకను హత్య చేసిన తర్వాతే పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10:56 గంటలకు నిందితులు పెట్రోల్‌ కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఇక పెట్రోల్ తేవ‌డానికి వెళ్లిన‌ప్పుడు సీసీ ఫుటేజ్‌లో వాళ్లు క్లీయిర్‌గా తెలిసిపోవ‌డంతో అడ్డంగా బుక్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: