మహారాష్ట్రలో బీజేపీ ఎన్నో కలలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నపుడు ఆ పార్టీకి శివసేన కోలుకోలేని షాకిచ్చింది. కేంద్రంలో అధికారం ఉండి కూడా ఇలా ఓ ప్రాంతీయ పార్టీ చేతిలో ఓడిపోయిన బీజేపీకి అవమానం మిగులుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అంతిమంగా లాభపడింది ఒకే ఒక్క వ్యక్తి అతడే ‘అజిత్ పవార్’. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై తిరుగుబాటు చేసినా కూడా ఇప్పుడు అజిత్ పవార్ ను ఎన్సీపీ పక్కన పెట్టకపోవడం విశేషం. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఎన్సీపీ తరుఫున కీలక పాత్ర పోషించేది అజిత్ పవారే అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

 

ఎన్సీపీ నుంచి.ఫిరాయించి అజిత్ పవార్ మహారాష్ట్రలో బీజేపీకి మద్దతు తెలుపడంతో ఒప్పందం ప్రాకారం ఆయన పై నమోదైన ఐటీ - ఈడీ కేసులను బీజేపీ ఎత్తివేసిందన్న వార్త  నడుస్తోంది. ఇప్పుడు తిరిగి ఎన్సీపీలో చేరి శరద్ పవారే తమ నాయుకుడు అని అజిత్ సంచలన ప్రకటన చేసారు.నిజానికి ఎన్సీపీలో అజిత్ పవార్ పవర్ ఫుల్ లీడర్. ఆయనకు మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో మంచి పట్టు ఉంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బంపర్ మెజార్టీ సాధించారు. అత్యధిక ఓట్ల తేడాతో ప్రత్యర్థులకు డిపాజిట్ గల్లంతు చేశారు. 

 

ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఎన్సీపీలోని అజిత్ పవార్ ను పక్కనపెట్టలేని పరిస్థితి ఉంది. ఆయన వెళ్ళిపోతే ప్రభుత్వం నిలబెట్టుకోవడం చాల కష్టం అందుకే కుటుంబ పరంగా - పార్టీ పరంగా ఆయనకే డిప్యూటీ సీఎంగా చేస్తారని తెలుస్తోంది. మరాఠా రాజకీయాల్లో ఒక శక్తిగా ఉన్న అజిత్ పవార్ ను కాలదన్నితే ఎన్సీపీ మనుగడకే ప్రమాదమని గ్రహించే శరద్ పవార్ ఫిరాయించినా కూడా అజిత్ నే పార్టీ స్టార్ నాయకుడిగా భావిస్తున్నాడట.

 

ఇలా బీజేపీకి ఫిరాయించినా ఇప్పుడు ఎన్సీపీలో తిరిగి చేరినా మొత్తం రాజకీయ నాటకంలో కీలక పాత్రధారి అయిన అజిత్ పవార్ రెంటికి చెడ్డ కానీ ఇప్పుడు ఆయనే కీలక నేతగా మారిపోయారు. మొత్తం ఉదంతంలో బాగా లాభపడిన వ్యక్తిగా అజిత్  పవార్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: