ఉదయాన్నే హడావుడిగా నిద్ర లేవడం, గబా గబా తయారై ట్రాఫిక్ లో బ‌య‌ట‌కు వెళ్ళ‌డం ఇవ‌న్నీ అంద‌రి జీవితాల్లో ప్ర‌స్తుతం కామ‌న్ అయిపోయింది. ప్ర‌స్తుతం ట్రాఫిక్ బాగా ఎక్కువ అయిపోవ‌డం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అందుకు ఓ వ్య‌క్తి ఈ ట్రాఫిక్‌తో విసిగిపోయి ఏకంగా ఇంట్లోనే క‌ష్ట‌ప‌డి ఒక హెలీకాప్ట‌ర్‌ను త‌యారు చేసుకున్నాడు. త‌న‌కి అందుబాటులో ఉన్న వ‌స్తువుల‌ను జ‌త‌ప‌రిచి ఆ హెలీకాప్ట‌ర్‌ను త‌యారు చేశాడు. 

 

 అక్కడ ఓ 8 గంటలు పనిచేసి సాయింత్రం ఏడుకి మళ్లీ ఇంటికి చేరడం. ఇలా ప్రతీ రోజూ చేసే రోటీన్ జాబ్స్ వీటివ‌ల్ల ఎదుర‌య్యే ట్రాఫిక్ స‌మ‌స్య‌లు మాములుగా లేవు. ఇటీవ‌లె ఇండోనేషియాకు చెందిన జున్‌జున్ జునేది అనే 42 ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్‌కు విసిగిపోయి ఇంటి వెనుకే హెలికాప్టర్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నగరంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల సమయం, ఇంధనం రెండూ వృథా అవుతున్నాయి. అందుకే, హెలికాప్టర్ తయారు చేసుకుంటున్నా’’ అని తెలిపాడు.

 

ఈ హెలికాప్ట‌ర్‌ 26 అడుగుల పొడవు క‌లిగి ఉంటుంది. ‘‘18 నెలల కిందట ఈ హెలికాప్టర్ తయారీ మొదలుపెట్టా. ఇప్పటివరకు దీనికి రూ.1,50,410 ఖర్చు చేశా. నేను, నా కుమారుడు, పక్కింటి వ్యక్తి కలిసి దీన్ని తయారు చేస్తున్నాం. ఈ హెలికాప్టర్‌ను పూర్తి చేస్తేనే నాకు సంతృప్తి లభిస్తుంది’’ అని తెలిపాడు. ఇక మ‌రి జున్‌జున్ కి ట్రాఫిక్ కష్టాలు పోయిన‌ట్లేనా  అన్న‌ది తెలియాలి. ఇక ఇదిలా ఉంటే గ‌తంలో పాకిస్టాన్‌కు చెందిన ఓ వ్యాపారి కూడా ఇలానే హెలికాప్ట‌ర్‌ను త‌యారు చేయ‌గా అనుమ‌తి లేకుండా దాన్నిన‌డ‌ప‌డం చ‌ట్ట‌ప‌రంగా నేరమంటూ పోలీసులు దాన్ని సీజ్ చేశారు. మ‌రి ఎవ‌రికి వారు ఇలా సొంతంగా వాహ‌నాల‌ను త‌యారు చేసుకుని న‌డిపేయ‌డం అన్న‌ది స‌రైన‌ది కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: