హైదరాబాద్ శివారులో శంషాబాద్ దగ్గర లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పని చేస్తున్న నిందితులు పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు మక్తల్ మండలం జక్లేర్ కు చెందిన మహ్మద్ షాషాను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు. ప్రియాంక హత్యకు నారాయణ పేట జిల్లా గుడిగండ్లకు చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు సహకరించినట్లు గుర్తించారు. 
 
పోలీసులు నిందితులను లారీ నంబర్ ఆధారంగా గుర్తించారు. ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరే తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రియాంక సోదరి భవ్య మీడియాతో మాట్లాడుతూ 6 గంటల సమయంలో ప్రియాంక ఇంటి నుండి వెళ్లిందని ఫోన్ చేసి భయంగా ఉందని చెప్పిందని చెప్పారు. 
 
ప్రియాంక భయమేస్తుందని చెప్పగా టోల్ బూత్ దగ్గర నిలబడమని చెప్పానని కానీ ప్రియాంక వినలేదని భవ్య చెప్పారు. ఆ తరువాత ప్రియాంక మరలా ఫోన్ చేసిందని కానీ కాల్ కట్ అయిందని నేను ఫోన్ లో ఛార్జింగ్ లేదేమో అని అనుకున్నానని భవ్య చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తామని చెప్పారని ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు రమ్మని పోలీసులు చెప్పగా అక్కడ ఉన్న మృతదేహం ప్రియాంకదే అని గుర్తించామని శ్రీధర్ రెడ్డి చెప్పారు. 
 
పోలీసులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే విచారణ జరిపి ఉంటే మాత్రం ప్రియాంక బతికి ఉండేదన్న ఆశ ఉండేదని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎవరూ ఇలాంటి తప్పు చేయకూడదని తప్పు చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ప్రజలు కూడా ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: