ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కు మొన్నటివరకు ఓ చిన్న అసంతృప్తి ఉండేది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన తమ మంత్రులు వాటిని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారని పదే పదే మంత్రివర్గ సమావేశాల్లో తన ఆవేదన వ్యక్తపరిచేవారు. కానీ ఇటీవల మాత్రం ఆయన దగ్గర నుంచి అలాంటి ఆవేదన ఏమి కనబడటం లేదు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు మంత్రులు తిరిగి గట్టి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా మంత్రులు జగన్ ని ఒక్క మాట అననివ్వకుండా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.

 

అసలు జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడమే టీడీపీ విమర్శలు చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. టీడీపీకి తోడు జనసేన, బీజేపీలు కూడా జగన్ పై ఓ రేంజ్ లో మండిపడుతూ వచ్చాయి. జగన్ ప్రజలకు మేలు చేసే పథకాలు తీసుకొచ్చిన, లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చిన ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే వీటిని మంత్రులు పూర్తిగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. అలాగే తాము చేసిన పనులని ప్రజలకు చెప్పడంలో వెనుకబడిపోయారు.

 

దీంతో పలు మంత్రివర్గ సమావేశాల్లో జగన్ ఇదే విషయంపై మంత్రులకు క్లాస్ పీకారు. ఇలాగే ఉంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఇక రెండు, మూడు సమావేశాలు తర్వాత మంత్రుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఎవరు తగ్గకుండా ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అందులోనూ కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ లు ప్రభుత్వానికి గట్టిగా అండగా నిలుస్తారు. ఇందులో కొడాలి, పేర్నిలు అయితే టీడీపీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

 

ప్రతిపక్షాలకు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వాయించేస్తున్నారు. పేర్ని మొదట్లో  పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తే, కొడాలి చంద్రబాబుని టార్గెట్ చేశారు. కొడాలి అయితే చంద్రబాబు, టీడీపీ వాళ్ళకు చుక్కలు చూపిస్తున్నారు. అక్కడక్కడ తాను మాట్లాడే మాటల్లో బూతులు వచ్చిన, ఏ మాత్రం తగ్గకుండా టీడీపీపై విరుచుకుపడుతున్నారు. అటు పేర్ని కూడా ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలకు చక్కగా వివరిస్తూనే..ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి కృష్ణా జిల్లా మంత్రులు ప్రతిపక్షాల దుమ్ముదులిపేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: