పోలీసలు దురుసుగా ప్రవర్తించడం సహజం కానీ దాని వల్ల కేరళలో దారుణం చోటు చేసుకుంది. బైకు నడుపుతున్న ఓ వ్యక్తిపై పోలీసు లాఠీ విసరడంతో ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నాడు, దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సిద్ధిఖ్ అనే 22 ఏళ్ల యువకుడు. తీవ్రగాయాలకు గురి అయ్యాడు, తలకు బలమైన గాయం, రక్తస్రావం, కాలు విరిగినట్లుగా అనిపిస్తోంది. ఇది అంతా కూడా ఓ పోలీసు చేసిన పని వల్ల  సిద్ధిఖ్ ఇలా అయ్యాడు.

 

ఈ సంఘటన కేరళలోని కొల్లాంలో నివసించే సిద్ధిఖ్ గురువారం ఉదయం ఇంటి నుంచి తన బైకుపై బయటకు బయలు దేరాడు. డ్యూటీ పై ఉన్న చంద్రమోహన్ వాహనాలను తనిఖీ చేస్తుండగా అటుగా సిద్ధిఖ్ వచ్చాడు. తనను ఆగాల్సిందిగా కోరాడు. కానీ పోలీసులు కదా.. భయంతో సిద్ధిఖ్ అలానే ఆగకుండా ముందుకు వెళ్లిపోయాడు. బండి ఆపకుండా పోవడంతో ఆగ్రహం చెందిన పోలీస్ చంద్రమోహన్ వెంటనే తన చేతిలో ఉన్న లాఠీని సిద్ధిఖ్ వైపు బలంగా విసిరాడు.

 

సిద్ధిఖ్ వెనక భాగాన లాఠీ బలంగా తగలడంతో తన బైక్‌ పై కంట్రోల్ తప్పాడు. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సిద్ధిఖ్ తలకు బలమైన గాయాలయ్యాయి. రక్తమోడుతున్న సిద్ధిఖ్ని దగ్గరలోని ఆసుపత్రిలో పోలీసులు తన కొడుకుని అడ్మిట్ చేసి వెళ్లిపోయారని సిద్ధిఖ్ తండ్రి చెప్పాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగి వెంటనే పోలీసుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఘటనపై ఆరా తీసిన కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా.. పోలీస్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కొల్లాం ఎస్పీకి ఆదేశాలు జారీచేశారు.

 

డీజీపీ ఆదేశాల మేరకు చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసినట్లు కొల్లాం ఎస్పీ హరిశంకర్ చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పిన ఎస్పీ హరిశంకర్... దగ్గరలోని సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డీఎస్పీ ర్యాంక్ ఉన్న అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు హరిశంకర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: