మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక తీర్పును హైకోర్టు ఇచ్చింది.  తెలంగాణ రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 నగరపాలిట ప్రాంతాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది.  మూడు నగరపాలిట ప్రాంతాలైన గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం నగరపాలిత కార్పొరేషన్ సమయం ఇంకా పూర్తి కాలేదు.  దీంతో 10 నగరపాలిత కార్పొరేషన్ లకు, 128 మున్సిపాలిటీల వరకు ఎన్నికలు జరిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  
మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియను మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు పేర్కొన్నది.  14 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  కొన్ని కారణాల వలన 128 మున్సిపాలిటీలలో ఏడు మున్సిపాలిటీ లకు ఎన్నికలు నిర్వహించడం లేదు.  అంటే మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 నగరపాలిత కార్పొరేషన్ లకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు.  ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం ఆఖరకు పూర్తయ్యే అవకాశం ఉన్నది.  
తెలంగాణలో కెసిఆర్ అధికారంలో వచ్చిన తరువాత ప్రతి ప్రాంతంలో తనదైన ముద్రను వేసుకున్నారు.  ఇటీవల జరిగిన హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా తెరాస పార్టీ భారీ విజయం సాధించింది.  ప్రతి ఎన్నికలకు తెరాస పార్టీ బలం పుంజుకుంటూ ఉండటంతో కెసిఆర్ కు తిరుగులేకుండా పోతున్నది.  అంతేకాదు, ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా కెసిఆర్ తీసుకున్న నిర్ణయం, దానిని అమలు చేసిన విధానం భేష్ అని చెప్పాలి.  
సమ్మె విరమించిన వెంటనే వారిని విధుల్లోకి తీసుకోకుండా.. కొంత ఊరించి ఆ తరువాత వారిని విధుల్లోకి తీసుకున్నారు.  నిజంగా ఇది అబినందించదగిన విషయంగా చెప్పాలి.  ప్రతి విషయంలో కూడా కెసిఆర్ అనుసరిస్తున్న విధానం వేరుగా ఉంటోంది.  ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పాదంలో నడుపుతున్నారు.   రోజు రోజుకు కెసిఆర్ కు రాష్ట్రంలో బలం పెరుగుతుండటంతో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా కనిపిస్తున్నారు.  మరి చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: