ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఓ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ అధినేత వయసు 70 దాటుతుండటంతో భవిష్యత్తులో టీడీపీని నడిపించే నాయకుడు ఎవరు అని అటు కేడర్...ఇటు నేతలు కూడా అంతర్గతంగా చర్చలు చేసుకుంటున్నారు. అయితే ఈ చర్చల్లోనే ఒకొరికి ఒకో ఆలోచన వస్తుంది. భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది నారా లోకేషే అని ఓ వర్గం అనుకుంటుంది. అలాగే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి ఇస్తే బాగుంటుందని మరో వర్గం భావిస్తుంది.  కాకపోతే ఎవరు ఎన్ని చర్చలు జరుపుకున్న భవిష్యత్తులో పార్టీని నడిపించేది లోకేషే అని స్పష్టంగా తెలుస్తుంది.

 

ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ కొడుకుని నాయకుడుగా ఎదిగేలా చేయడానికి ఎప్పుడో ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే 2014లో ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. ఇక మొన్న ఎన్నికల్లో డైరెక్ట్ గా నిలబెట్టారు. ఓటమి పాలైనప్పటికి పార్టీపై నిదానంగా పట్టు ఇస్తూ వస్తున్నారు. ఇటు లోకేశ్ కూడా దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. మొన్నటివరకు స్పీచ్ ల్లో తడబాటుకు గురయ్యి, తప్పు తప్పుగా మాట్లాడటం వల్ల అపోజిషన్ నేతలు పప్పు అని ఎగతాళి చేశారు. అలాగే దాని వల్ల పార్టీకు కూడా డ్యామేజ్ అయింది.

 

దీంతో విషయం తెలుసుకున్న లోకేశ్ ఇప్పటి నుంచి తనని తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇటీవల టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డ ప్రతిచోటాకు వెళ్ళి వారిని ఓదారిస్తున్నారు. అలాగే అధికార వైసీపీపై కూడా స్పష్టంగా విమర్శలు చేస్తున్నారు. మునుపటిలా కాకుండా కొంచెం మెరుగుగా స్పీచ్స్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా తన బరువు వల్ల ఆకృతి కూడా ఇబ్బందిగా ఉండటం వల్ల, దానిని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఇక ఈ పరిస్తితులన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో టీడీపీని నడిపించేది లోకేషే అని అర్ధమైపోతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. తాను నాయకుడుగా ఎదిగే సమయానికి అంటే మరో 10 ఏళ్లలో ఎన్టీఆర్ కూడా రాజకీయరంగంలోకి దిగే అవకాశముంది. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే లోకేశ్ నాయకుడు కాబట్టి తనకు ఎంతవరకు మద్ధతుగా నిలబడతారనేది చెప్పలేం. అలా అని పార్టీని చీల్చి తాను అధినేతగా ఉండాలని అనుకున్న చెప్పలేం. అయితే ఇక్కడ ఎన్టీఆర్...లోకేశ్ కు మద్ధతు ఇస్తే అభిమానులు ఒప్పుకునే పరిస్తితి ఉండదు. ఎందుకంటే తమ హీరో అధినాయకుడుగానే ఉండాలని అనుకుంటారు. పోనీ పార్టీని చీలిస్తే ఎవరికి ఉపయోగం ఉండదు. మరి చూడాలి రానున్న రోజుల్లో టీడీపీలో ఎన్టీఆర్, లోకేశ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: