ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలి అంటే ఇప్పుడు నాయకత్వం విషయంలో చాలా మార్పులు రావాల్సి ఉంది. ఆ పార్టీలో నాయకత్వ సమస్య ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు తర్వాత పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది. చంద్రబాబు పార్టీని ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే విజయవంతంగా ముందుకి నడిపించారు. ఇప్పుడు ఆయన వయోభారం తో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70 ఏళ్ళు... ఇంకా ఆయన ఆలోచనలతో పార్టీని ముందుకి నడిపించడం కష్టం అన్న‌ది అంద‌రికి అర్థ‌మైంది.

 

అ పార్టీని విజయవంతమైన వ్యూహాలతో నడిపించడం అనేది సాధ్యం కాని పరిస్థితి అని అంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని సలహాలను పార్టీ క్యాడర్ చంద్రబాబుకి ఇస్తున్నారు. లోకేష్ వల్ల‌ పార్టీ నడపడం సాధ్యం కాని పని అని చెప్తూ... ఆయన స్థానంలో మరో సమర్ధవంతమైన నేత కోసం ప్రయత్నాలు చెయ్యాలని సూచిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ కి కొన్ని బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. అవి  లోకేష్ వల్ల‌ సాధ్యం కాని పరిస్థితి. పార్టీకి ఆయన ప్రసంగాలు కూడా ఉపయోగపడే పరిస్థితి లేదని అంటున్నారు.

 

ఇక సోషల్ మీడియా బాధ్యతను కూడా, చంద్రబాబు లోకేష్ కి అప్పగించారు. ఆ బాధ్యతలను ఆయన నుంచి తప్పించి గల్లా జయదేవ్ లేదా రామ్మోహన్ నాయుడు కి అప్పగించాలని కోరుతున్నారు. అలా అయితేనే పార్టీ ముందుకి వెళ్తుందని అంటున్నారు. ఇక కీలకమైన ఎన్నికల సమయంలో లోకేష్ పెత్తనం అనేది ఉండకూడదు అనేది వారు కోరుతున్నారు. ఆయనకు ఎన్నికల్లో ఏ బాధ్యతలు అప్పగించ‌వద్దని మరో యువ నేతకు ఆ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ఇక లోకేష్ తో ప్రచారం కూడా తక్కువ చేయించాలని, ఇప్పటి నుంచే ఎన్నికలకు మరో నేతను చూడాలని కోరుతున్నారు. అయితే వీరి మాట‌లు బాబు చెవుల‌కు ఎంత వ‌ర‌కు ఎక్కుతాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: