నరేంద్రమోడికి దగ్గర అవటానికి చంద్రబాబునాయుడు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవటం తనవల్ల కాదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. ఇటు జగన్ తో పడక అటు కేంద్రంలో మోడితో  గొడవలు పెట్టుకోవటంతో చంద్రబాబు పరిస్ధితి దుర్భరంగా తయారైంది. ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటంతో చంద్రబాబుకు సమస్యలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

ఇప్పటికి జగన్ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలే అయ్యింది. ఈ ఆరు నెలలే జగన్ పాలననే  చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఇంకా నాలుగున్న సంవత్సరాల పరిపాలనను తట్టుకోవటం తన వల్ల కాదన్న విషయం చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే మోడి, అమిత్ షాలకు తన ఎంపిల ద్వారా రాయబారాలు పంపుతున్నారు.

 

ఇప్పటికే టిడిపిలో నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి తానే పంపించారు. తనపై ఎటువంటి కేసులు నమోదు కాకుండా దర్యాప్తు సంస్ధల నుండి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవటానికే రాజ్యసభ ఎంపిలను పంపారు. మరి వాళ్ళ రాయబారాలు ఏమయ్యాయో తెలీటం లేదు. తాజాగా లోక్ సభ ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడులు బిజెపి జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటి అయ్యారు.

 

వైసిపి వల్ల తమకు ఎదురవుతున్న సమస్యలను అమిత్ కు వివరించారట. ఆయన కూడా ఐనో అన్నట్లుగా సమాధానం చెప్పారట. అయినా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు టిడిపి ఎంపిలు చెబితేనే అమిత్ కు తెలుస్తాయా ?  రాష్ట్రంలోని  బిజెపి నేతలు ఎప్పటికప్పుడు పరిస్ధితులను వివరిస్తునే ఉన్నారు. ఇది కాకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ పనికూడా అదే కదా. ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ఫిర్యాదుల పేరుతో చంద్రబాబే వారిని రాయబారానికి పంపినట్లు అర్ధమవుతోంది. అర్జంటుగా మళ్ళీ ఎన్డీఏలో చేరకపోతే చంద్రబాబుకు నిద్రపట్టేట్లు లేదు. అందుకనే మోడిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: