2017 నంద్యాల ఉప ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్దకు ఒక పంచాయితి వెళ్ళింది... పార్టీ మారిన ఒక ఎమ్మెల్యే గారు నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి... పరిస్థితి ఇది ఇది ఇది అంటూ ఉన్నదీ లేనట్టు లేనిది ఉన్నట్టు ఒకటికి వంద సార్లు చెప్పారు... ఆ తర్వాత చెప్పిన ఆయనకు మంచి పదవి దక్కింది... ఇక బాధితుడికి కనీసం చంద్రబాబుతో కరచాలనం కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది.

 

ఏళ్ళ తరబడి పార్టీలో ఉన్న వ్యక్తిని కాదని చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో ఆయన పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరం జరిగారు. ఇక వైసీపీలో చేరడం ఇష్టం లేక రాజకీయాలకే దూరంగా జరిగిపోయారు. కనీసం ఆయన ఎందుకు దూరం జరిగారు అనేది కూడా స్పష్టత రాలేదు. రాజకీయంగా చంద్రబాబు బలంగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటనలు చెప్పిన కొద్దీ ఉంటాయి.

 

రాజకీయంగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ మారిన వాళ్ళను పెట్టుకుని తప్పుడు మాటలు చంద్రబాబు వింటారని ఒక ఎమ్మెల్యే అంతర్గత సంభాషణల్లో అప్పుడు అంటే అది పార్టీని షేక్ చేసింది. ఇప్పుడు పార్టీ బలహీనంగా ఉంది... అయినా సరే చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాల పర్యటనలకు వెళ్తున్న ఆయనతో కొందరు నేతలు ఒంటరిగా సమావేశం అవుతున్నారు. చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి ఎవరూ లేని సమయంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఆయన వద్దకు వెళ్లి ఉన్న మాటలు లేని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై కార్యకర్తలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఇదేం కర్మ అంటూ వాళ్ళు మండిపడుతున్నారు. కనీసం వాస్తవాలను కూడా చంద్రబాబు తెలుసుకోకుండా... బలమైన నాయకుడు అనే వాడు ఎన్ని చెప్పినా సరే... చంద్రబాబు కొంద‌రు చెప్పే చెప్పుడు మాట‌లే నమ్ముతున్నారని అసహన౦ వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: