పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణాల్లోనూ చంద్రబాబు, ఆయన మద్దతు దారులు దోపిడీకి పాల్పడ్డారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇందుకు ఏపీ టిడ్కో లో గురువారం జరిగిన రివర్స్‌టెండరింగ్‌ నిదర్శమని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లోని యూనిట్లకు రివర్స్‌టెండరింగ్‌ విధానం ద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేశామని మంత్రి బొత్స వివరించారు.

 

చంద్రబాబు మూడు లక్షల 10 వేల ఇళ్ల యూనిట్స్‌కు టెండర్లు పిలిచారని, ఆ లెక్క ప్రకారం రూ. 2626 కోట్లు డిఫరెన్స్‌ వాల్యూ ఉందన్నారు. ఆ డబ్బు చంద్రబాబు, ఆయన తాబేదారులు కాజేసేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఐదు లక్షల ఇళ్లులకు టెండర్లు పిలిచి ఉంటే రూ. 4 వేల కోట్లకుపైగా దోపిడీ జరిగేదన్నారు. చంద్రబాబు ఇవాళ ఇన్ని కథలు చెబుతున్నాడే.. దీనికి ఎవరు సమాధానం చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు.

 

నాలుగు జిల్లాల్లో ఉన్న 14368 హౌసింగ్‌ యూనిట్లకు టెండర్‌కు వెళ్తే దాని అగ్రిమెంట్‌ కాస్టు రూ.707.4 కోట్లు ఉందని రివర్స్‌టెండరింగ్‌ విధానంలో రూ.601.12 కోట్లకు కోడ్‌ చేయడం జరిగింది. చిత్తూరులో ఉన్న ప్యాకేజీకి రూ.40.85 కోట్లు తక్కువకు వేశారు. కృష్ణా జిల్లాలో 14.35, విశాఖపట్నంలో రూ.28.83, విజయనగరంలో రూ.21.88 కోట్లు తక్కువకు కోడ్‌ చేసి కంపెనీలు పనులు దక్కించుకున్నాయని, రివర్స్‌టెండరింగ్‌ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ. 105.91 కోట్లు ఆదా అయ్యిందన్నారు.

 

అదే గత ప్రభుత్వంలో అయితే రూ.106 కోట్లు పెరగడమే కాకుండా లబ్ధిదారుడికి రూ. 70 నుంచి రూ. 90 వేల భారం పడేదని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రతి పనిలోనూ పారదర్శకంగా ముందుకు వెళ్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇవ్వాలనేది సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: