ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు గాని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విస్త్రుత పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని జిల్లాలలోను ఆయన పర్యటించి కార్యకర్తల మనోభావాలను నాయకుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో కొంత మంది కార్యకర్తలకు ఆయన అండగా నిలబడే ప్రయత్నం కూడా చేశారు.

 

ఇక నాయకులతో నేరుగా మాట్లాడుతూ పార్టీ పరిస్థితి గురించి ఆరా తీయడం, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయడం చేశారు చంద్రబాబు. అయితే ఇదే సమయంలో పార్టీలో ఉన్న కొన్ని సమస్యలను తెలుసుకున్న చంద్రబాబుకి షాక్ తగిలే సమాధానాలు వచ్చినట్టు తెలుస్తుంది. వాటిల్లో వర్గ విభేదాలు, కొందరి నాయకుల పెత్తనం... కడప జిల్లా పర్యటనకు చంద్రబాబు వెళ్ళగా ఆయన ముందే కొందరు కొట్టుకున్నారు.

 

కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి వర్గం చంద్రబాబు ముందే ఒక కార్యకర్త మీద దాడి చేసింది. దీనిని లైవ్ లో చూసిన చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఈ సమయంలో ఆయన కొందరిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు... అసలు పార్టీలో మా మాట చెల్లడం లేదని,  మీ మద్దతు ఉందని మమ్మల్ని కనీసం దగ్గరకు రానీయడం లేదని, మీకు సమస్యలు కూడా చెప్పుకునే పరిస్థితి లేదని చెప్పారట.

 

ఇక జిల్లాల పర్యటనలో భాగంగా... వర్గ విభేదాల గురించే ఎక్కువగా విన్నారని సమాచార౦. సోషల్ మీడియాలో ఘోరంగా విఫలమయ్యామని, దళిత సామాజిక వర్గాలను దూరం చేసుకున్నామని, కొన్ని సామాజిక వర్గాలకు ఓటు బ్యాంకు పేరుతో ఎక్కువ న్యాయం చేయడం పార్టీని ఇబ్బంది పెట్టిందని, సంక్షేమ పథకాల అమలు అనేది మీరు చెప్పిన స్థాయిలో జరగలేదని చంద్రబాబుకి వివరించారట నేతలు. ఈ పరిస్థితులు మారాలని కోరారట. మ‌రి అస‌లు వాస్త‌వాలు తెలిశాక అయినా చంద్ర‌బాబు మార‌తారా ?  లేదా ?  మళ్లీ త‌న చుట్టూ ఉండే భ‌జ‌న ప‌రుల చ‌ట్రంలో ఇరుక్కుపోతారా ? అన్న‌ది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: