కోడిగుడ్డు తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి... కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకొని తింటే అబ్బో ఆ టెస్ట్  వేరబ్బా అన్నట్లుగా ఫీలవుతుంటారు జనాలు. ఉడక పెట్టిన కోడి గుడ్డు అయితే ఆరోగ్యానికి మంచిది టెస్ట్ లో  కూడా బాగా మంచిది అనుకుంటారు .అందుకే  ఎక్కువగా ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు జనాలు . ఇక ఉడకబెట్టిన కోడిగుడ్డు కాస్త ఒక్కసారిగా  మింగేస్తూ వుంటారు చాలామంది. ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ కోడిగుడ్డు ప్రాణం తీస్తుంది అని తెలిస్తే మాత్రం కోడిగుడ్డు జోలికి వెళ్లడానికి కాస్త ఆలోచిస్తారు కదా. ఇప్పుడు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా ఓ వ్యక్తి కోడి గుడ్డు తింటే హఠాత్ మరణం పొందాడు. ఈ వ్యక్తి మరణించడం స్థానికంగా ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఏంటి ఆశ్చర్యపోయారు కదా .. గుడ్డు తింటే చనిపోవడం ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ స్టొరీ చదివితే మీకే అర్థం అయిపోతుంది. 

 

 

 

కోడిగుడ్డు కాస్త గొంతులో  ఇరుక్కుపోయి ఓ వ్యక్తి హఠాత్ మరణం చెందిన ఘటన హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తున్నడు. అయితే మద్యం తాగుతూ తినడానికి ఉడకబెట్టిన కోడి గుడ్లను తీసుకున్నాడు ఆ వ్యక్తి. ఇక మద్యం తాగుతూ తినడానికి తీసుకున్న ఉడకబెట్టిన గుడ్డు ని కాస్త అమాంతం ఒక్కసారిగా తినడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాధితుడు ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయి  మరణించాడు. యాచారం మండలం గుంగల్ గ్రామానికి చెందిన యాదయ్య... ఇబ్రహీంపట్నం లోని శ్రీరామ వైన్స్ లో  సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఇక గురువారం రాత్రి యాదయ్య పర్మిట్ రూమ్ లో మద్యం సేవించాడు. 

 

 

 

 మద్యం సేవిస్తుండగా ఉడకబెట్టిన కోడిగుడ్డు అమాంతం తినేద్దాం అనుకున్నాడు యాదయ్య. దీనికోసం ఉడకబెట్టిన కోడిగుడ్డు ఆమాంతం నోటిలో పెట్టుకొని అమాంతం తినటానికి  ట్రై చేశాడు కానీ ఆ కోడి గుడ్డు కాస్త గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు యాదయ్య. వెంటనే  తన తోటి సిబ్బంది యాదయ్యను  ఆస్పత్రికి తరలించారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించిన  యాదయ్య ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. గొంతులో గుడ్డు ఇరుక్కుపోవడం వల్ల యాదయ్య ఉపిరిరాడక  చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: