ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ గురించి ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డితర్వాత ఎక్కువగా ఫోకస్ అవుతున్న నాయకులలో ముందుగా వినపడే పేరు అనిల్ దే. గత ఎన్నికల్లో టీడీపి పార్టీ నారాయణ లాంటి ధీటైన అభ్యర్థి కి ఎదురు నిలబడి స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన అనిల్ కుమార్ యాదవ్ ఏకంగా నీటి పారుదల లాంటి పెద్ద శాఖకి మంత్రి కావడం ఆయన అదృష్టం అని అప్పట్లో చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

 


అప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం కుమార్ యాదవ్ కు అదృష్టం బాగా కలిసి వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల వ్యవహారాలను దగ్గరుండి పరిశీలించేందుకు పర్యటించారు. అయితే బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆయన పనులన్నింటినీ ఏకాగ్రత తో పరిశీలిస్తుండగా ఒక ఉపద్రవం వచ్చిపడింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒక పెద్ద తేనెటీగల గుంపు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు అతని బృందం పై దాడి చేశాయి.

 


వెంటనే అనిల్ కుమార్ యాదవ్ తో సహా అందరూ పరుగు లంకించుకున్నారు. వారందరి లో మంత్రి అనిల్ పరిగెత్తుకెళ్లి కార్లో కూర్చొని అద్దాలను మూసేసుకోవడంతో సురక్షితంగా బయటపడగా తేనెటీగల దాడిలో మంత్రి గన్ మెన్ లతో సహా 50 మందికి గాయాలయ్యాయి. వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంతో చాకచక్యంగా పరిస్థితిని మంత్రి అనిల్ కుమార్యాదవ్ వ్యవహరించగా అతని బృందం కూడా ముందు మంత్రి యొక్క రక్షణకే ప్రాధాన్యమిచ్చి తమ ప్రాణాలను పణంగా పెట్టడం చూసి పలువురు అతని బృందాన్ని ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: