ఆర్టీసి సమ్మె విషయంలో ఎవరికి న్యాయం జరిగింది ? ఎవరికి అన్యాయం జరిగింది ? అనేది పక్కన పెడితే కెసిఆర్ ఇచ్చిన సంకేతాలు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణాలో బలపడాలి అని భావిస్తున్న విపక్షాలకు ఆయన ఇచ్చిన వార్నింగ్ గురించి అంతా ఇంత అకాదు. దాదాపు రెండు నెలల పాటు సమ్మె జరిగినా సరే కెసిఆర్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు అనేది వాస్తవం. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఈ సమ్మెలో మాత్రం ఆయన కనీసం వాళ్ళతో చర్చలు కూడా జరిపే ప్రయత్నం చేయలేదు కెసిఆర్.  



ఇక సమ్మె వాళ్ళు విరమించడం నాలుగు రోజుల పాటు మేము విధుల్లో చేరతం ఏ షరతులు లేకుండా తీసుకోండి అని ప్రకటించడం జరిగాయి. అయినా సరే కెసిఆర్ మాత్రం వెనక్కు తగ్గలేదు. అనేక చర్చల తర్వాత ఆయన గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విధుల్లోకి చేరమని చెప్పారు.



దీని ద్వారా ఆయన ఇచ్చిన సంకేతాలు ఒక్కసారి చూస్తే... ఏ సమ్మెలు, ఏ ఉద్యమాలు అయితే చేసి నేను నేడు ఈ స్థాయికి వచ్చానో అవి చేసి తనను బలహీనపరచడం సాధ్యం కాదనే విషయాన్ని స్పష్టం చెప్పారు. ఇక ఈ సమ్మె ద్వారా లాభపడాలి అని భావించిన భారతీయ జనత పార్టీకి కెసిఆర్ గట్టి సంకేతాలే ఇచ్చారు. తనతో తెలంగాణాలో అంత సులువు కాదు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని కేంద్రానికి ఫిర్యాదు చేసినా కెసిఆర్ మాత్రం భయపడలేదు.



తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని బిజెపి చూసినా ఆయన మాత్రం వెనక్కి కనీసం తగ్గలేదు. రాజకీయంగా విపక్షాలు దీన్ని వాడుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది కూడా కెసిఆర్ ఏ.. ఏ ఒక్క డిమాండ్ కెసిఆర్ నేరవేర్చకపోయినా... విధుల్లోకి చేరమని చెప్పినందుకు ఆయన దేవుడు అయ్యారు. దీనితో విపక్షాల ఆటలు తన వద్ద సాగవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: