కదిరి మున్సిపాలిటీ పరిధిలో గల మస్సనాంపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో, ఇద్దరు చిన్న పిల్లలను ఆ పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి బెంచికి కట్టి శిక్ష వేసిన సంఘటన జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు పిల్లలు చదువులో వెనక బడటం, 'లవ్ లెటర్స్ ' రాయడం వంటి  విషయాలు ఈ శిక్షకు కారణంగా చెప్పుకొచ్చారు.

 

పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్నీ మీడియా కు చెప్పగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్నీ ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ని అడగగా మొదట ఆమె ఐదవ తరగతి విద్యార్ధి 'లవ్ లెటర్' రాశాడని, ఆ తర్వాత ఐదవ తరగతి విద్యార్ధి, మూడవ తరగతి విద్యార్ధి తో కలిసి అల్లరి చేశారని మాట మార్చారు. ప్రధానోపాధ్యాయురాలు పిల్లలను బెంచికి కట్టి శిక్ష వేశారనే మాటను ఖండించారు, కానీ ఆమె పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకే ఆ శిక్ష పిల్లలకు వేశారని చెప్పారు.

 

ఈ సమస్యను రీజినల్ డైరెక్టర్, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ మరియు కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల దృష్టికి తీసుకెళ్లగా, ఆమె పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీద తమకు ఇప్పుడే పిర్యాదు అందింది అని, ఈ విషయం పై విచారణ జరిపించి, తగిన చర్య తీసుకుంటామన్నారు.

 

ఆంధ్ర  ప్రదేశ్ బాల హక్కుల సంఘము అధ్యక్షుడు అయిన అచ్యుత రావు, ఈ సమస్య ఫై జిల్లా కలెక్టర్, జాతీయ  పిల్లల హక్కుల పరిరక్షణ సమితి (ఎన్‌సిపిసిఆర్) కి పిర్యాదు చేసి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పై కఠిన చర్యలుతీసుకోవాలని కోరారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ విచారణ ప్రారంభించారు. శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్  నల్లని రాజేశ్వరి ఈ అంశం పై విచారణ జరిపించి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు డిమాండ్ చేశారు.

 

కదిరి ఎమ్మెల్యే  పి వీ సిద్ద రెడ్డి కొన్ని రోజుల క్రితం ఈ పాఠశాలను సందర్శించగా, ఈ పాఠశాల యాజమాన్యం, పాఠశాల ప్రారంభమైన ఇంకా రాలేదు అని  పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: