వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి  దారుణంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ దేశంలో ఆడవారిగా పుట్టకూడదా అంటూ ప్రముకులు స్పందిస్తున్నారంటేనే ఈ ఘోరకలి ఎంతలా విషాదం నింపుతుందో  అర్ధ‌మవుతోంది. నలుగురు దుండగులు ఒక అమాయక యువతి మీద అత్యాచారం చేయ‌డం, దారుణంగా  హింసించి హత్య చేయడం, పెట్రోల్ పోసి తగులబెట్టడంపైన జాతి యావత్తూ నివ్వెరపోతోంది. మనిషిలో ఇంత రాక్షసత్వం ఎపుడు వచ్చిందని కూడా షాక్ తింటున్నారు.

 

ఇదిలా ఉండగా ప్రియాంకారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం  నెలకొంది.  రాత్రి ఇంటికి వచ్చిన  మంత్రి సత్యవతి రాధోడ్ ని ఘోరావ్ చేశారు. ఉదయం నుంచి మంత్రులు పరామర్శకు వస్తున్నారు తప్ప న్యాయం మాత్రం జరగడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. నిందితులు ఎవరో తెలిశాక ఇక ఆలస్యం ఎందుకు వారిని ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. 

 

ఈ కేసు విషయంలో మీనమేషాలు లెక్కబెట్టడం పైన కూడా స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకారెడ్డికి తగిన న్యయం జరగాలంటే బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని వారు అంటున్నారు. ప్రియాంకారెడ్డిపై జరిగిన దారుణానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని, మరొకరు ఎవరూ ఇలాంటి పని చేయకుండా నిందితులను కాల్చి చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 


ఇదిలా ఉండగా ప్రియాంకారెడ్డి హత్యోదంతంపైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఇది నిజంగా బాధాక‌రమని ఆయన అన్నారు. ఒక మనిషి పట్ల సాటి మనిషి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా. కనీసం ఊహించుకోవడానికి కూడా భయంగా  ఉందని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతిని తెలిపారు. వివిధ రంగాల ప్రముఖుల పోస్టులతో  సోషల్ మీడియాలో సైతం ప్రియాంకారెడ్డి హత్య కేసు ఇపుడు ట్రెండింగ్ గా ఉంది. ఈ విషయంలో పోలీసుల వైఖరిని తప్పుపడుతూ పోస్టింగులు వస్తున్నాయి. నిందితులను మీడియా ముందుకు లేట్ గా తీసుకురావడం పట్ల కూడా నిరసన వ్యక్తం అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: