చంద్రబాబుకు అమరావతిపై విపరీతమైన ప్రేమ.. నిజమే.. అమరావతిని ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అదీ నిజమే.. అందుకోసం ఆయన గత ఐదేళ్లూ అహోరాత్రాలూ కష్టపడ్డారు.. పోనీ..అది కూడా నిజమే అనుకుందాం.. శాశ్వత నిర్మాణాలు కట్టకపోయినా.. అద్భుతమైన గ్రాఫిక్స్ సృష్టించారు. ఓకే.. కానీ ఇన్ని చేసిన చంద్రబాబు ఆ ఒక్క పని మాత్రం ఎందుకు చేయలేదు..

 

చంద్రబాబు శీలాన్నే శంకించేందుకు ఆస్కారం కల్పిస్తున్న ఆ పని చంద్రబాబు ఎందుకు చేయలేదు.. ఇదీ ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం మాత్రం చంద్రబాబు అండ్ కో వద్ద కనిపించడం లేదు. ఇంతకీ ఆ పని ఏంటంటారా..? అదే అమరావతి శాశ్వత నివాసం కట్టుకోకపోవడం.. తాత్కాలికంగా లింగమనేని రమేశ్ ఇంట్లో ఉంటున్నా.. ఆయన ఎందుకు పర్మనెంట్ ఇల్లు కట్టుకోలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

 

ఎన్నికలకు మూడేళ్ల ముందే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. చంద్రబాబు ఎందుకు ఇళ్లు కట్టుకోలేదో చెప్పాలని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. రాజధానికి, సింగపూర్‌ ప్రభుత్వానికి సంబంధం లేదని వారు చెప్పారు. సింగపూర్‌లోని వ్యాపార సంస్థ మాత్రమే ఇక్కడకు వచ్చిందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాల ద్వారా మానవ అభివృద్ధికి పాటుపడుతున్నారని.. మానవ అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని వైసీపీ మంత్రులు అన్నారు.

 

జగన్ అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ కూడా సొంత ఇల్లు తీసుకున్నాడు. కానీ.. అమరావతే శ్వాసగా భావించిన చంద్రబాబు కానీ.. ఆయన కుమారుడు లోకేశ్ కానీ..ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. అంతే కాదు.. విభజన జరిగిన తర్వాత కూడా హైదరాబాద్ లోని నివాసాన్ని పడగొట్టి మళ్లీ కట్టుకున్నారు. మరి ఈ ప్రశ్నకు టీడీపీ నేతలు సమాధానం చెబుతారా.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: