డయల్ 100తో నేడు హైదరాబాద్ లో ఒక మహిళా సేఫ్ అయ్యింది. ఏంటి డయల్ 100 ? సేఫ్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా ?  నిన్నటి నుండి ప్రతిఒక్కరి కంట, నోటా బాధతో ఒకే మాట వస్తుంది. ఆ మాటకు కారణం హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి ఘటనే కారణం. ఆమె హత్యతో తెలుగు రాష్ట్రాలు రెండు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ మరింత అప్రమత్తం అయ్యింది. డయల్ 100 నినాదాన్ని పేపర్, టీవీ ఛానెల్స్ నుంచి సోషల్ మీడియా వరుకు ప్రతి ఒక్క చోట డయల్ 100 నినాదం ప్రతి మహిళకు తెలిసేలా ప్రకటనలు చేశారు. ప్రతి ఒక్క మహిళా వినియోగించుకోవాలని సూచించారు. 

 

ఈ నేపథ్యంలోనే పోలీసులు ఓ మహిళకు సాయం చేశారు. వివరాల్లోకి వెళితే ఎల్బీ నగర్ శివారు ప్రాంతాల్లో నివసించే ఓ మహిళ రోజువారీ విధుల్లో భాగంగా తన స్కూటీపై బయటకు వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో దారి మధ్యలో బండి ఆగిపోయింది. జన సంచారం పెద్దగా లేని ఆ ప్రాంతంలో ఆగిన ఆ మహిళ వెంటనే డయల్ 100కి కాల్ చేసింది. 

 

బండిలో పెట్రోల్ అయిపోయిందని.. ఇక్కడ ఎవరు లేరు అని ఆమె సమాచారం ఇచ్చింది. తాను ఉన్న ప్రాంతాన్ని వివరించింది. ఈ విషయం వెంటనే సమీపంలోని ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం అందింది. వారు ఓ బాటిల్ లో పెట్రోల్ తీసుకుని ఆ మహిళ ఉన్న ప్రాంతానికి చేరుకుని బండిలో పెట్రోల్ నింపారు. 

 

ఈ విషయాన్నీ రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డయల్ 100 వినియోగించుకోండి.. మిమ్మల్ని మేము కాపాడుతాము అని పిలుపునిచ్చారు సీపీ మహేష్ భగత్. చూశారుగా.. ఇంకా ప్రతి ఒక్కరు ఇబ్బంది వస్తే.. వస్తుంది అని అనిపించినా వెంటనే డయల్ 100కు ఫోన్ చెయ్యండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: