ప‌శు వైద్యురాలు డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ప్రియాంకపై సామూహిక అత్యాచారం చేసిన అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల‌ను మహ్మద్ ఆరీప్ (26), జొల్లు శివ (20), జొల్లు నవీన్ (20), చెన్నకేశవులు(20)గా గుర్తించామని.. వెంటనే వారిని అరెస్ట్ చేశామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా.. వారికి త్వరగా కేసు పడేలా చేస్తామని క‌మిష‌న‌ర్‌ సజ్జనార్ తెలిపారు. కాగా,  ప్రియాంక రెడ్డి తండ్రి త‌న కూతురు అత్యంత పాశ‌వికంగా క‌న్నుమూసిన తీరును జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా ఆయ‌న ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ...కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు.

 

 

సీపీ సజ్జనార్ విలేక‌రుల స‌మావేశాన్ని ప్రియాంకరెడ్డి కుటుంబం టీవీలో వీక్షించింది. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా సంస్థ వారిని ప‌ల‌క‌రించ‌గా...ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.  ఓ  ఆడపిల్ల తండ్రిగా అభ్యర్ధిస్తున్నాను...కోర్టులో నిందితుల తరపున ఏ న్యాయవాది వాదించకండి అని ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి న్యాయ‌వాదుల‌ను కోరారు. సమాజంలో జరిగే నేరాలపై అవగాహన లేకే త‌న కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మరో ఆడపిల్లకు ఇలాంటి సంఘటన జరుగకుండా యువతులకు పోలీసులు అవగాహాన కల్పించాలని ఆయ‌న కోరారు.

 

కాగా, బుధవారం రాత్రి ప్రియాంక బైక్ పార్క్ చేసి గ‌చ్చిబౌలి వెళుతున్న స‌మ‌యంలోనే నిందితులు ఆమె ప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించే ఎత్తుగ‌డ‌ను వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సీపీ తెలిపారు. ప్రియాంక బైక్ పార్క్ చేస్తున్న సమయంలో  అక్కడే ఉన్న నిందితులు ప్రియాంక బైక్ పంక్చ‌ర్ చేయాల‌ని చూశార‌ని వివ‌రించారు. నవీన్ పంక్చర్ చేశాడ‌ని తెలిపారు. ప్రియాంక వ‌చ్చిన త‌ర్వాత  శివ అనే వ్యక్తి దగ్గరలో మెకానిక్ షాపు ఉంటే తీసుకెళ్తానంటూ చెప్పి వెళ్లాడ‌ని ఇదే అదునుగా భావించిన మహ్మద్ ఆరీఫ్ ప్రియాంకను లాక్కెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశాడ‌ని తెలిపారు. ఆ సమయంలో ఆమెను గొంతు, ముక్కు నొక్కిపెట్టి  హత్య చేసి.. ఆపై దుబ్బటి కప్పి.. చెటాన్ పల్లి సమీపంలో ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టి.. మళ్లీ మృత దేహం కాలిందా లేదా అంటూ.. వెనక్కి వచ్చి చెక్ చేసుకున్నారని.. సీపీ సజ్జనార్ వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: