ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఉన్న సంగతి మనందరికీ విధితమే. కానీ విద్యార్థులకు వడ్డించే ఆ మధ్యాహ్న భోజనం మాత్రం... తినలేనంత ఘోరంగా ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల కోసం ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని... ఇంకా ఇతర వంటకు సంబంధించిన సరుకులను పక్కదారి పట్టిస్తూ వారు లాభ పడడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అది వంట వండే వాళ్ళు కావచ్చు.. పాఠశాల యాజమాన్యం కావచ్చు... ఎవరైతే ఏంటి.. పేద విద్యార్థుల కడుపునిండా తినకుండా.. బ్యాంక్ ఖాతా నింపుకుంటున్నారు ఈ కేటుగాళ్లు.

 


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోనేభద్రలోని ఒక ప్రభుత్వ చిన్న బడిలో కేవలం ఒకే ఒక్క లీటర్ పాలని.. ఒక పెద్ద బక్కెట్లో పోసి.. ఆ తర్వాత ఆ బక్కెట్ నిండా నీళ్ళతో నింపారు. ఇక ఆ పాలు నీళ్ల మిశ్రమాన్ని 81 మంది విద్యార్థులకు పోశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అక్కడే గ్రామ పంచాయతీ వార్డు మెంబరు దేవ్ పాటియా  .. పోషకాలు లేని ఆహారాన్ని స్లైబంవా ప్రాంతంలో ఉన్న చిన్న బడి విద్యార్థులకు వడ్డిస్తున్నారంటూ పై అధికారులకు ఫిర్యాదు చేశాడు.

 

మధ్యాహ్న భోజనం పథకం కింద.. తెహ్రి(కిచిడి లాగాఒక రకమైన అన్నం రెసిపీ), పాలను ప్రతిరోజు విద్యార్థులకు వడ్డించే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. కానీ వీళ్లు పాలను మాత్రం అందించకుండా.. వంట చేసే మనిషికి స్కూల్ యాజమాన్యం కేవలం ఒక లీటర్ పాలనే అందిస్తున్నారు. దాంతో.. ఆ వంటమనిషి చేసేది ఏంలేక లీటర్ పాలల్లోనే.. నీళ్ళు కలిపి 81 మంది విద్యార్థులకు పోస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఈ గ్రామ పంచాయతీ వార్డు మెంబరు దేవ్ అక్కడి స్థానిక ప్రజల ద్వారా తెలుసుకున్నారు.. ఈ 1 లీటర్ పాలు 81 మంది విద్యార్థుల విషయం సీరియస్ అవ్వడంతో సీనియర్ అధికారులు ఈ పనిని ఎవరు చేసారో తెలియడానికి విచారణ చేపట్టారు. ఎవరో తెలిస్తే వారిపై సత్వర చర్యను తీసుకుంటామని అధికారులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: