ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ చేదు అనుభవం ఎదురయింది . సత్యవతి రాథోడ్ ను స్థానికులు అడ్డుకున్నారు . స్థానికులను పక్కకు పంపే ప్రయతాన్ని పోలీసులు చేయగా , పోలీసుల చర్యను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు . ప్రియాంకారెడ్డి పై అత్యాచారం చేసి , హత్య చేసిన దుండగులపై కేసులు పెట్టడం కాదు ,  ఎన్ కౌంటర్  చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు . ప్రియాంకారెడ్డి ని పథకం ప్రకారం ముగ్గురు  డ్రైవర్లు, ఒక క్లినర్ అత్యచారం చేసి, హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు .

 

అత్యాచారం చేసే సమయం లో ప్రియాంకారెడ్డి అరుస్తుందని భావించిన దుండగులు ఆమె నోరు మూయడం వల్లే ఊపిరాడక చనిపోయిందని తెలిపారు . ప్రియాంకారెడ్డి అత్యాచారం , హత్య కేసులో  ఏ1 లారీ డ్రైవర్‌ ఆరిఫ్‌ (26), ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.  తొండుపల్లి దగ్గర యువతి స్కూటీ పార్క్ చేయడం లారీ వాళ్లు చూసి, తిరిగి  మళ్లీ ఆమె అక్కడికే వస్తుందని నిందితులు మాట్లాడుకుని కుట్ర పన్నారని వెల్లడించారు. పథకం ప్రకారం స్కూటీ వెనుక చక్రం లో గాలితీసి పంచర్ అయిందని చెప్పి , తాము సహాయం చేస్తున్నట్లుగా నటించి పక్కనే నిర్మానుష్యంగా ఉన్న ఇంటిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేస్తుండగానే ,నోరుమూసి హత్య చేశారని అన్నారు .

 

అయితే ప్రియాంకారెడ్డి అత్యాచార, హత్య  కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని  కేసులు పెట్టినట్లు పోలీసులు చెబుతుండగా , స్థానికులు మాత్రం తమకు కేసులు వద్దని నిందితుల్నిఎన్ కౌంటర్ చేయాలని కోరుతున్నారు . మరొక యువతిపై ఈ తరహా అత్యాచార  ఘటన  జరగకుండా ఉండాలంటే నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయడం  ఒక్కటే పరిష్కారమని చెబుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: