చంద్రబాబు జగన్ని ఇంకా సీఎంగా చూడడంలేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన తెల్లారిలేస్తే జగన్ మీద నానా మాటలు అంటూ  ఉంటారు. అసమర్ధ ప్రభుత్వమని అంటారు. చేతకాని సర్కార్ అంటారు. అవినీతి సీఎం అంటారు. నేరస్థుల పాలన అంటారు. ఇలా తనకు తోచిన విమర్శలు చేస్తూనే ఉంటారు. మరి ఇన్ని విధాలుగా జగన్ని చంద్రబాబు మాటలతో దాడులు చేస్తూనే ఉంటారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే అమరావతిలో చంద్రబాబు పర్యటనలో భాగంగా జగన్ కి ఓ వార్నింగ్ లాంటిదే ఇచ్చారని అంటున్నారు. జగన్ అమరావతి విషయంలో ఓ పధకం ప్రకారం ముందుకు సాగుతున్నారు. అమరావతిలో పనికి వచ్చే వాటిని మాత్రమే నిర్మాణాలకు ఉపయోగించుకోవాలని, ఇప్పటికే నిర్మాణాల దశలో ఉన్న వాటిని పూర్తి చేయాలని జగన్ నిర్ణ‌యించారు.

 

 

మిగిలిన వాటిలో మాత్రం నిర్మాణం చేయకూడదని, దానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని కూడా జగన్ అంచనా వేసుకున్నారు. అందువల్ల మిగిలిన భూములను రైతులకు ఇవ్వడం ద్వారా అమరావతిలో వీలైనంత పరిమితంగా భూములలోనే అభివ్రుధ్ధి చేయాలని ఆయన సంకల్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుతో పాటు టీడీపీలో ఉన్న వారికి దడ పుట్టుకుంది అంటున్నారు.

 

బాబు బినామీ నేతల భూములు,  వాటినే నమ్ముకున్న వారు జగన్ కొత్త ప్లాన్ తో తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల వారంతా తమకు న్యాయం చేయమని చంద్రబాబుని కోరిన మీదటనే ఆయన హఠాత్తుగా అమరావతి పర్యటన పెట్టుకున్నారని, తాను వేసిన డిజైన‌లోనే అమరావతి రాజధానిలో నిర్మాణాలు  కట్టాలని కూడా డిమాండ్ చేశారని అంటున్నారు.

 

ఇదొక రకంగా వార్నింగులాంటిదేనని చెబుతున్నారు. మరి జగన్ బాబు మాట విని మొత్తానికి మొత్తం 33 వేల ఎకరాల్లో నిర్మాణాలకు సిధ్ధపడతారా. అది జరగనే జరగదు అంటున్నారు. అపుడు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: