తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రియాంక రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులు లారీ నంబర్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు లారీ డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు ప్రియాంక స్కూటీలో గాలి తీసేసి లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షాషాపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు నిందితులుగా ఉన్నారు. 
 
ఈ నలుగురు నిందితుల గురించి భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నలుగురు నిందితులు రోజూ పీకల దాకా మందు తాగి ఏ మహిళ ఎటు నుంచి వస్తుందా అని చూసి అడ్డగించేవారని అడ్డగించిన మహిళలను విడిచిపెట్టేవారు కాదని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు నలుగురు నిందితులు పీకల దాకా తాగేసి నలుగురు మహిళలను వేధించారని సమాచారం. ఆ నలుగురు మహిళలు తప్పించుకున్నారు కానీ ప్రియాంక మాత్రం వీరి నుండి తప్పించుకోలేకపోయింది. 
 
పథకం ప్రకారం నిందితులు ప్రియాంక స్కూటీ టైర్ లో గాలి తీసేశారు. పంక్చర్ డ్రామా ఆడిన నిందితులు ప్రియాంకకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియాంక గట్టిగా అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. లైంగిక దాడి చేసిన సమయంలో నోరు, ముక్కు మూసేయటంతో ఊపిరాడక ప్రియాంక చనిపోయింది. మృతదేహాన్ని తగులబెట్టాలని నిందితులు ఎస్.ఆర్ పెట్రోల్ బంకుకు వెళ్లగా ద్విచక్ర వాహనం ఎక్కడుందని సిబ్బంది ప్రశ్నించారు. 
 
ఆ తరువాత నిందితులు ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి చటాన్ పల్లి వంతెన దగ్గర పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిందని నిర్ధారించుకున్న తరువాత మార్గమధ్యంలో స్కూటీని వదిలేసి నలుగురు కలిసి లారీలో బయల్దేరారు. పోలీసులు సరిగా స్పందించలేదని వచ్చిన ఆరోపణలపై సజ్జనార్ స్పందించారు. రాత్రి 11.40 గంటలకు ఫిర్యాదు అందిందని సిబ్బంది బృందాలుగా విడిపోయి సీసీ ఫుటేజీలను పరిశీలించారని తెల్లవారుజామున 3.10 గంటలకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: