అర్ధరాత్రి ఆడది నిర్భయంగా తిరగగలిగినపుడే దేశానికీ నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీజీ చూపిన మాట తెలిసిందే.  గాంధీజీ చెప్పినట్టుగా దేశానికీ స్వతంత్రం వచ్చిందా అంటే తప్పకుండా లేదని అంటారు.  అర్ధరాత్రి కాదు కనీసం పట్టపగలు మరొకరి తోడు లేకుండా బయటకు మహిళలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.  రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో తెలుసా... 
దేశంలో రోజులో హత్య, రోజుకు నాలుగైదు మానభంగాలతో దారుణంగా మారిపోయింది.  దేశంలో కామాంధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మానవమృగాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా... మద్యం.. మారుతున్నా కల్చర్.. సినిమాల హడావుడి.. అంతేకాదు, డబ్బు.. తక్కువ శ్రమతో ఎక్కువగా డబ్బు వచ్చేస్తున్నది.  అంతకు ముందులా కాకుండా ఎక్కవ శ్రమ లేకుండానే డబ్బు వచ్చిపడుతుంది.  
డబ్బుతో పాటు కావాల్సిన వస్తువులు అన్ని కూడా చేతికి వస్తున్నాయి.  ఇలా ప్రతి ఒక్కటి చేతికి రావడంతో అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  చిన్న పిల్లలు సైతం మద్యం తాగడానికి అలవాటు పడుతున్నారు.  ఈ అలవాటు కారణంగా మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు. ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.  వీరి ప్రవర్తన అమ్మాయిలకు చేటుగా మారింది.  అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. అత్యాచారాలు చేస్తూ.. హత్యలకు పాల్పడుతున్నారు.  
తెలంగాణలోనే అత్యధికంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఈ హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి.  విచ్చలవిడిగా మద్యం  అమ్మకాలు జరుగుతుండటంతోనే ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.  ఇది హైదరాబాద్ నగరం కాదని, అబలాబాద్ అని అంటున్నారు. మద్యానికి అబలలు బలి అవుతున్నారు.  ఎన్ని శిక్షలు విధించినా... ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలని, నిందితులను బహిరంగంగా శిక్షించాలని అంటున్నారు. 2008లో చేసినట్టుగా నిందితులను కాల్చి చంపాలని అంటున్నారు ప్రజలు.  లేదంటే ప్రియాంక రెడ్డి నిందితులను ప్రజలకు అప్పగించాలని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: