యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసు ను తెలంగాణ పోలీసులు కేవలం 48 గంటల లోపే చేదించారు. నారాయణపేట జిల్లా కు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు. నిన్న రాత్రి ప్రియాంక రెడ్డి నివాసం వద్ద భారీ ప్రదర్శనను నిర్వహించి నిందితులను ఎన్కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రియాంక రెడ్డి తల్లితండ్రులు మాత్రం పోలీసుల అవగాహన లోపం వల్ల తమ కూతురు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఘటన జరిగిన రోజు రాత్రి ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురైన తండ్రి శ్రీధర్ రెడ్డి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసాడు. పోలీస్ స్టేషన్ సిబ్బంది మాత్రం ఇది తమ పరిధిలోకి రాదు శంషాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్లాలని సూచించారు, ఇక అక్కడికి వెళ్లగా ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని సూచించారు. ఇలా పోలీసులు తమ పరిధి కాదంటే స్టేషన్ల చుట్టూ తిప్పించుకున్నారు. ఇలా చెయ్యడం వల్ల విలువైన సమయం వృధా అయ్యి ప్రియాంక చనిపోయింది. 

 

ఇలా చేసి ఉంటే బ్రతికేదేమో 

 

పోలీస్ సిబ్బంది శ్రీధర్ రెడ్డి వెళ్లిన వెంటనే పిర్యాదు స్వీకరించి 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేసి దర్యాప్తు చేసి ఉంటే ప్రియాంక బ్రతికిఉండేది అని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ అంటే పోలిసులు భాదితుల ఫిర్యాదును వెంటనే స్వీకరించాలి, దీనికి ఆ స్టేషన్ ఈ స్టేషన్ అంటూ పరిధి ఉండదు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినా మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ఈ జీరో ఎఫ్ఐఆర్ కు నెంబర్ కేటాయించారు కానీ దర్యాప్తు చేపడతారు. పోలీసులు శ్రీధర్ రెడ్డి వెళ్లిన వెంటనే కాలయాపన చెయ్యకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసి ఉండి ఉంటే తమ కూతురు తప్పక బ్రతికేదని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి జీరో ఎఫ్ఐఆర్ మీద చాలా తక్కువ మంది పోలీసులకు అవగాహన ఉందని తెలుస్తోంది. సామాన్య ప్రజానీకం "పోలీసులకే జీరో ఎఫ్ఐఆర్ మీద అవగాహన లేకపోతే ప్రజల్లో ఏం చైతన్యం తీసుకువస్తారు" అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: