మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి.  ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే చాలా కష్టం.  ఒంటరిగా మహిళలు ప్రయాణం చేయడానికి పడే ఇబ్బంది అంతాఇంతా కాదు.  పబ్లిక్ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా , ఆటోల్లో ప్రయాణం చేస్తున్నా ఈ వేధింపులు తప్పడం లేదు.  టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత రాత్రి పగలు తేడా లేకుండా మహిళలు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది.  అదే వారి పాలిట శాపంగా మారుతుందా.. ఒంటరిగా ప్రయాణం చేయాలి అంటే మహిళలు ఏం చేయాలి.  
ఎలా చేస్తే మహిళలు బ్రతుకుతారు.  మార్గం ఏంటి అంటే.. దానికి చాలా మార్గాలు ఉన్నాయి.  ఒకటి మహిళా తాను అబల కాదు..సబల అని బలంగా నమ్మాలి.  తాను ఏదైన చేయగలను.. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనగలను అనే ధైరం ఉండాలి.  అలా ధైర్యంగా ఉన్నప్పుడు ఆ మహిళ తప్పకుండా అన్నింటిని ఎదుర్కొంటుంది.  ఎలాంటి విపత్కర పరిస్థితిల్లో కూడా ఆమె ప్రయాణం చేయగలుగుతుంది.  ఇక చిన్నతనం నుంచి ధైర్యంగా పోరాటం నేర్చుకోవాలి.  నలుగురు ఉన్నప్పుడు వారిని ఎలా ఎదుర్కొనాలో తెలుసుకోవాలి.  అంతేకాదు, పార్టీ ఒక్కరి దగ్గర తప్పని సరిగా పెప్పర్ స్ప్రే ఉంచుకోవాలి.  ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.  ఇప్పుడు చాలామంది మహిళలు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకొని ఉంటె తప్పకుండా కొంత వరకు తమను తాము రక్షించుకోవాలి.  మహిళలు ధైర్యంగా లేరు అని తెలిస్తే అలాంటి వారిపైనే అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు.  
ఒక మహిళ ధైర్యంగా ఉన్నారు అంటే అలాంటి వారిని టచ్ చేయడానికి ఆలోచిస్తారు.  ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి పక్కకు వెళ్తారు.  అందుకే ప్రతి మహిళా కూడా తన వంతు భాద్యతగా రక్షణ చర్యలు తీసుకోవాలి.  పోలీసులు వచ్చేలోపు తమను తాము ప్రొటెస్ట్ చేసుకోవటానికి కనీస ధైర్యం ఉండాలి.  ధైర్యం ఉన్నప్పుడే ఏదైనా చేయగలం.  అంతేకాదు, ప్రతి మహిళ సెల్ ఫోన్ లో స్పీడ్ డయల్ లో తప్పని సరిగా కొన్ని అత్యవసర ఫోన్ నెంబర్లు ఉండాలి.  ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తమను తాము కొంతవరకు ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: