ఇప్పుడు వరకు మూడు సంవత్సరాలు ఉన్న డిగ్రీ కోర్సులో ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసింది. ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుండగా ఇప్పుడు మాత్రం సెమిస్టర్ గా విడదీస్తూ పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు చదివేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొంతమంది ఇష్టంగా చదివి ఫస్ట్ రాంక్ కోసం కష్టపడుతుంటే ఇంకొంతమంది ఇంకెన్ని రోజులు రా నాయనా అంటూ బాధపడుతూ ఉంటారు. మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును 100 సంవత్సరాలుగా ఫీలవుతుంటారు కొంతమంది విద్యార్థులు. కానీ ఏం చేస్తాం చదవక తప్పదు కాబట్టి బలవంతంగానే చదువులు సాగిస్తూ ఉంటారు. ఇక ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి వీళ్ళ తిప్పలు మామూలుగా ఉండదు. 

 

 

 

 ఏదో ఫస్ట్ ర్యాంక్  కోసం చదువుతున్నట్లుగా ఎగ్జామ్స్ టైం లో తెగ చదివేస్తూ ఉంటారు. అటు ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా అంతే నాలుగేళ్ల ఇంజనీరింగ్ ఎప్పుడు అయిపోతుందా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తయ్యే సరికి  ఎలాగోలా బ్యాక్ లాక్స్ అన్ని గట్టెక్కించేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వచ్చే ఏడాది నుంచి ఇదంతా  మారిపోతుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కోర్సును 3 ఏళ్ళ నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నారు. ఇక ఇంజనీరింగ్ కోర్సును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచుతున్నారు. ఈ విషయం కొంత మంది విద్యార్థులకు వినడానికి బాగానే ఉన్నా ఇంకా కొద్ది మందికి మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించే  విషయం. 

 

 

 

 డిగ్రీ కోర్సు మూడేళ్లు ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు పూర్తయిన తర్వాత... విద్యార్థులు అందరూ తప్పనిసరిగా ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ చేయాలని నిబంధన  ఉన్నత విద్యామండలి తీసుకొచ్చింది. విద్యార్థులందరూ డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసినప్పటికీ  ఉద్యోగానికి సరిపడా... సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటం లేదని ఉన్నత విద్యా మండలి తెలిపింది. దీంతో చదువు పూర్తయినప్పటికీ కూడా చాలామంది విద్యార్థులకు  ఉద్యోగాలు రావడం లేదని... అందువల్లే కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో నైపుణ్యాల పెంచి  ఉపాధి అవకాశాలు ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: