తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు ప్రయాణిస్తున్న వాహనం శనివారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది.  ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి గాయాలయ్యాయి.  వెంటనే నక్కపల్లి హాస్పిటల్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  చేతికి, కాలికి గాయాలయ్యాయి.  అయితే, పెద్ద ప్రమాదం కాలేదని, తాను సేఫ్ గానే ఉన్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  అసలు ప్రమాదం ఎలా జరిగింది.  కారణం ఏంటి తెలుసుకుందాం.  


విజయవాడ నుంచి అచ్చెన్నాయుడు తన సొంత వాహనం డిస్కోవరీలో ప్రయాణం చేస్తుండగా.. నక్కపల్లి దగ్గరకు రాగానే ఎదురుగా మరో వాహనం వచ్చింది.. హఠాత్తుగా ఎదురు రావడంతో దానిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశారు.  ఆ ప్రయత్నంలోనే ఎదురుగ ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది.  దీంతో వాహనం కుడిభాగం దెబ్బతిన్నది.  కుడివైపు ఉన్న సీట్లో అచ్చెన్నాయుడు కూర్చొని ఉన్నారు.  
వాహనం బలంగా డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనం అలా ఢీకొన్నప్పుడు అయన డోర్ కు బలంగా గుద్దుకున్నారు.  దీంతో చేతికి స్వల్పంగా దెబ్బతగిలింది.  వెంటనే ఆయన్ను హుటాహుటిన దగ్గరలోనే ఉన్నహాస్పిటల్ కు తీసుకెళ్లారు.  అక్కడే మనకు ప్రాధమిక చికిత్స అందించారు.  చిన్న గాయాలే  అయినప్పటి చేతికి రక్తం కోరడంతో బ్యాండేజ్ వంటివి వేశారు.  తనకు ఎలాంటి ముప్పు రాలేదని స్వల్పగాయాలతోనే బయటపడ్డానని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  
అచ్చెన్నాయుడుకు ప్రమాదం జరిగిందనే వార్త తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీనేతలు స్పందించారు.  హుటాహుటిన అక్కడ చర్యలు తీసుకున్నారు. ఆయనకు కావాల్సిన వైద్యం అందుబాటులో ఉంచారు.  ప్రమాదం పెద్దది కాదు అని తెలిసిన వెంటనే టిడిపి శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.  ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు కీలక నేత.  ఉత్తరాంధ్రలోనే కాదు, తెలుగుదేశం పార్టీలో సైతం ఆయనే కీలక నేత.  అయన ఒక్కరే అసెంబ్లీలో బలమైన వాణిని వినిపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: