సమాజంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయని లోకం కోడైకూస్తుంటే భయం అన్నది వదిలిన కామాంధులు రెచ్చిపోతున్నారు. వయస్సు మరచి మరీ వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు వరుసగా జరుగుతున్న హత్యాచారాలు మరో వైపు చీమకుట్టినట్లుగా కూడా చలించక మగపందులు చేస్తున్న ఆకృత్యాలు ఇలాంటి సమయంలో ఆడపిల్లల రక్షణకు ఆయుధాలు చేపట్టాలేమో. లేదా బయట కనిపించకుండా ఇంట్లోనే దాచాలేమో అనేలా పరిస్దితులు మారుతున్నాయి.

 

 

ఈ విషయంలో ప్రభుత్వం ఏ చట్టాన్ని అమలు చేస్తుందో, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటుందో కానీ పరిస్దితిని మాత్రం అదుపులోకి తేకుంటే ఆమ్మ అనే పదం అక్షరాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ సహజంగా మాత్రం వినిపించదు. ఇప్పటికే ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు గుండెలు జారిపోతున్నాయి. ఆడపిల్లలకైతే బయటకు వెళ్లితే తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతామనే నమ్మకం కూడా కలుగడం లేదు.

 

 

ఇప్పుడు పరిస్దితులు బ్రిటీష్ కాలం నాటి పరిస్దితులను తలపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఆరేళ్ల చిన్నారిపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపాడు.

 

 

సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి బాలిక స్పృహలో లేకపోవడంతో ఆందోళనకు గురైంది. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చిన బాలిక జరిగిన విషయం తల్లికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

 

చూసారా ఈ మాయదారి కామం ఈ వయస్సు నుండే మొదలైతే ఇలాంటి వారు పెరిగి పెద్దైయ్యాక ఉగ్రవాదులకంటే తీవ్రంగా మారుతారు. తల్లిదండ్రులు మీ పిల్లలమీద తప్పకుండా కన్నేసి ఉండగలరు ఎందుకంటే వారిని కన్నపాపానికి ఆపాపంలో సగభాగం మీరు కూడా మోయవలసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: