ఎల్లోమీడియాకు ఇది నిజంగా పెద్ద శిక్ష అనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మూకుమ్మడిగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ను తిరస్కరించారు. 175 నియోజకవర్గాల్లో పోటి చేస్తే టిడిపి గెలుచుకున్నది 23 సీట్లు. అంటే ఏ స్ధాయిలో జనాలు చంద్రబాబునాయుడు పరిపాలనను తిరస్కరించారో అర్ధమైపోతోంది. సరే టిడిపి పరిస్ధితే ఇలాగుంటే ఇక జనసేన గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు.

 

అధికారంలో ఉన్నంత కాలం ఆకాశమే హద్దుగా అవినీతితో చెలరేగిపోయారు చంద్రబాబు. పాలనలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టే జనాలు అంతలా ఛీ కొట్టారు. అయితే ఐదేళ్ళ చంద్రబాబు వైఫల్యాలను ఎల్లోమీడియా బాగా వెనకేసుకొచ్చింది. ఎక్కడా ఆయన వైఫల్యాలు బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకున్నది. సరే చంద్రబాబు ఫెయిల్యూర్లు బయటపడకుండా ఎంతగా కాపుకాసినా ఉపయోగం కనబడలేదన్నది వేరే సంగతి.

 

ఎప్పుడైతే అధికారంలో నుండి దిగిపోయారో వ్యక్తిత్వంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పూర్తిగా దిగజారిపోయారు. ఇక్కడే ఎల్లోమీడియాకు బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినదానికి కానిదానికి రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా దాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డికి ముడేసి ఎల్లోమీడియా కథనాలు అచ్చేస్తోంది. ఇదంతా కేవలం ఎల్లోమీడియాకు చంద్రబాబుతో ఉన్న బంధం కారణంగానే జరుగుతోంది.

 

అయితే జగన్ పై జనాల్లో ఎంత వ్యతిరేకతను పెంచుదామని ఎల్లోమీడియా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. అదే సమయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లను బ్రహ్మాండంగా ప్రోజెక్టు చేద్దామని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫెయిలవుతున్నాయి.

 

ఏదో చంద్రబాబు పుత్రరత్నం  కాబట్టే లోకేష్ ఈమాత్రమైనా చెలాయిస్తున్నారు. నిజానికి లోకేష్ లో ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేవని తెలిసినా టిడిపి నేతలు, ఎల్లోమీడియా మోయాల్సి రావటమే బాధాకరం. ఎల్లోమీడియా ఎంతగా జాకీలేసి లేపాలని ప్రయత్నిస్తున్నా ముగ్గురు నేతలు లేవలేకపోతున్నారు. తెరవెనుక పెనవేసుకున్న భాగోతాల కారణంగా పై ముగ్గురిని ఎల్లోమీడియా మోయక తప్పటం లేదు. ఏం చేస్తాం చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత అని పెద్దలు ఊరికే అన్నారా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: