నాలుగువందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర గల హైదరాబాద్‌ మహానగరంలో. అంతర్జాతీయ నగరంగా విల్లసిల్లే రాజధాని నగరంలో అనేక ప్రాంతాలు ఆటవికుల అడ్డాలుగా మారాయి. జనసంచారం తగ్గుముఖం పట్టగానే జంతువులై స్వైరవిహారం చేస్తున్నాయి. కొద్దిగా చీకటయితే చాలు అసాంఘిక శక్తులు వళ్లు విరుచుకుంటున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను అనుసరిస్తూ.. మంచిగా నటిస్తూ అవకాశం దొరకబుచ్చుకుని సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నాయి.

 

 

నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. కంట పడిన వాళ్లు ‘ఆడ’వాళ్లయితే చాలు.. వయసుతో నిమిత్తం లేదు. పసికూనల నుంచి వయోధికుల వరకు ఈ మృగాలు వెంటబడి తన కామకొరలతో వేటాడుతున్నాయి. ఎంతోమంది యువతులు మృగాళ్ల పశువాంఛకు సమిధలవుతున్నారు. ఇదంతా సాధారణ జనజీవనానికి దూరంగా ఉండే అడవుల్లో కాదు.. కొండలు, గుట్టల్లో కాదు.. గొప్పగా చెప్పుకుంటున్న నగరంలో మాటువేసి కాటు వేస్తున్నాయి.

 

 

ఇదే కాకుండా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రత కరవవుతోంది. ఇలాంటి అనేకానేక విషాదాంతాలకు పోలీసు యంత్రాంగం మౌనసాక్షిగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా, వేలాది మంది పోలీసులతో కూడిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో తోడేళ్లూ పంజా విసురుతున్నారంటే..

 

 

అత్యాధునిక పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నలు మనసున్న వారికి శరాలై తగులుతున్నాయి. ఇకపోతే ఫ్లైఓవర్‌ క్రీనీడ, కాలనీ అంచుల్లోని కాలిబాట, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్‌ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడ అయితే ఏం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి.

 

 

ఇలాంటి అనేకానేక చోట్లు నగరంలో ఉన్నాయి. అందుకే మహిళలు, ఉద్యోగినులు ఎల్లప్పుడు మీ దగ్గరా ఉప్పుకలిపిన కారం పొడి పాకెట్స్ ముందు జాగ్రత్తగా ఉంచుకోండి మీమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇదొక ఆయుధంగా కాసేపు ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: