ఒకే ఒక్క  ఎంపీ ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీకి దేశమంతా బలం లేదు. అయినా గుర్తింపు ఉన్న పార్టీనే. కానే ఆ పార్టీలో ఇంతవరకూ  ఇంత నోరున్న ఎంపీని ఎవరూ చూడలేదు. ముఖ్యంగా  ఆ పార్టీ అధినేత మరణించాక ఇంతటి ఫైర్ బ్రాండ్ ఎంపీని ఆ పార్టీ కూడా చూడలేదు. దేశమంతా జయించామని మురిసిపోతున్న నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఆ ఎంపీ ఒక్కడే చుక్కలు చూపిస్తున్నాడు.

 

 

ఎంపీ మరెవరో కాదు శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన లేకపోతే మహారాష్ట్రలో ఈ రోజు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదు. బాలథాక్రే దూకుడు, రాజకీయ వ్యూహాలు ఎక్కువగా సంజయ్ రౌత్ కే వచ్చాయని అంటారు. లేకపోతే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి సీఎం పీఠం మాదేనని చెప్పి మరీ దక్కించుకున్నాడీ  సంజయ్.

 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మాటామంతీ కలపడం అయితేనేం, సోనియా గాంధీతో సంప్రదింపులు చేయడం అయితేనేం సంజజ్ రౌత్ వ్యూహాలను పక్కాగా అమలు చేసి మోడీ, అమిత్ షాలకు గట్టి దెబ్బ కొట్టేశాదు. కళ్ళ ముందు చూస్తూండగానే మహా పీఠం బీజేపీ చేజారింది.

 

ఇక అక్కడితో ఆగని సంజయ్ రౌత్ గోవాలో పీఠాన్ని కూడా కూలుస్తానని సవాల్ చేస్తున్నారు. తొందరలోనే అక్కడ కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడి బీజేపీని దించేస్తాయని సంజయ్ చేసిన ప్రకటన్ ఇపుడు బీజీపీలో ముచ్చెమటలు పోయిస్తోంది.

 

ఇదిలా ఉండగా  ఇప్పటికే ‘గోవా ఫార్వర్డ్‌ పార్టీ’ అధ్యక్షుడు విజయ్‌ సర్దేశాయ్‌ శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పక్కా క్లారిటీతో చెప్పిన సంజయ్ రౌత్ త్వరలో గోవాలోనూ అద్భుతం జరగబోతోందని చెప్పేశారు. కాంగ్రెస్‌ సహా వివిధ పార్టీలతో కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు మేము రెడీ  అవుతున్నామని సంజయ్ చేసిన ప్రకటన ఇపుడు కాషాయదళంలో కలవరమే రేపుతోంది.

 

ఇంతటితో కూడా సంజయ్ రౌత్ వూరుకోవడం లేదు, మేము దేశంలోనూ బీజేపీని నిలువరిస్తామని అంటున్నారు. అంటే రేపటి రోజున కేంద్రంలో కూడా కమలదళానికి తిప్పలు తప్పవన్న మాట. అవును ముల్లును ముల్లుతోనే తీస్తారు, ఇపుడు ఒక హిందూత్వ పార్టీని మరో హిందూత్వ పార్టీయే మట్టికరిపిస్తుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: