అసలు సమాజానికి ఏమైంది. ఇక్కడ బ్రతుకున్నది అసలు మనుషులేనా? వీరంతా ఆమ్మ పేగు పంచుకుని పుట్టిన వారేనా? ఈ మృగాలను కన్నవారు మనుషులే కదా? కాని ఇలాంటి నికృష్టమైన చర్యలు చేసేవారు పశువులకు గాని పుట్టలేదు కదా అనే అనుమానం? ఏమో పశువాంచతో పుట్టారేమో ? ఎవరికి తెలుసు. ఎందుకంటే తల్లి, చెల్లి, కూతురూ అనే భేధం లేకుండా పందులు నీచమై అశుద్ధంలో దొర్లినట్లుగా కామం అనే కంపును ఒళ్లంతా నింపుకుని అమాయకపు ముఖాలేసుకుని నక్కలా లోకంలో మనుషుల మధ్య సంచరిస్తున్నారు.

 

 

అందుకే మనం సమాజంలో మనుషుల మద్యనే బ్రతుకుతున్నామా ? అనే ఒక ప్రశ్న ఇప్పుడు ప్రతి ఆడపిల్ల హృదయాన్ని చిద్రం చేస్తుంది. ఇకపోతే ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఆడపిల్లలపై జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది వారి బలహీనతనా? లేక వ్యవస్ద బలంగా లేకపోవడం వల్లనా రాజ్యాంగం రాసిన పెద్దలకే తెలియాలి. రాష్ట్రాన్ని ఏలే నాయకులకే అర్ధం అవ్వాలి. ఇక ఏంజరిగిందో తెలియదు కానీ నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ హాస్టల్‌ నుంచి యువతి అదృశ్యమైంది. అయితే యువతి హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా శవాన్ని తీసికెళ్లు.. నాన్నా.. అంటూ సూసైడ్‌ నోట్‌ రాయడంతో... ఒక్కసారిగా హాస్టల్‌ యాజమాన్యం అప్రత్తమైంది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

 

 

మౌనిక(19) అనే యువతి నిజామాబాద్‌ జిల్లా నబీపేటకు చెందిన అమ్మాయని చదువు నింత్తం హిమాయత్‌నగర్‌లో గర్ల్స్‌ అండ్‌ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటూ కేశవమెమోరియల్‌ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక్కడే బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటున్న మణిరత్నం అనే యువకుడితో కొద్దిరోజులుగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో ఈ నెల 26న ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. మరుసటి రోజు అంటే 27వ తేదీ ఉదయం 6.30గంటలకు హాస్టల్‌ రికార్డ్స్‌లో సంతకం చేసి బయటకు వెళ్లిన మౌనిక..

 

 

ఓ ఆటోలో ప్రయాణించి సచివాలయం సిగ్నల్‌ వద్ద దిగి అక్కడ నుంచి నడచుకుంటూ ట్యాంక్‌బండ్‌ చిల్డ్రన్‌పార్క్‌ వైపు వెళ్లింది. ఇదంతా ఆయా పరిధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. అదే సమయంలో మణిరత్నం కూడా కనిపించకుండా పోవడంతో.. ఇద్దరూ కలసి వెళ్లిపోయారా లేక ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ నేతృత్వంలో ఎస్‌.ఐ. లిఖితరెడ్డి రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: