దేశ ప్రజలను విపరీతంగా ఆకర్షించే బంగారంపై మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఖచ్చితమైన బంగారం అమ్మకం జరిగేలా.. ప్రజలు మోసపోకుండా కేంద్రం కొత్త విధానాలు తీసుకురానుంది. 2021 జనవరి 15 నుంచీ బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసింది కేంద్రం. దేశంలో బంగారంతో ఏ నగలు చేసినా, అమ్మినా హాల్ మార్కింగ్ కచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుతం హాల్ మార్కింగ్ లేని నగలన్నింటినీ 2021 జనవరి 15 లోపు వ్యాపారులు అమ్ముకోవాల్సి ఉంటుంది. హాల్ మార్క్ లేకుండా బంగారం విక్రయాలు జరుపకూడదు.

 

 

ఇకపై బంగారం అమ్మే వ్యాపారులంతా భారతీయ ప్రమాణాల మండలి (BIS) దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని కూడా స్పష్టం చేసింది. ఈ నిబంధనలు పాటించని వ్యాపారులకు బంగారం విలువపై లక్ష నుంచి 5 రెట్ల వరకూ ఫైన్, సంవత్సరం పాటు జైలు శిక్ష తప్పదని తెలిపింది. ఒక ఆభరణానికి హాల్‌మార్క్‌ వేసేందుకు రూ.50 ఖర్చు అవుతోంది. ఇప్పటివరకూ వ్యాపారులే నగలకు హాల్ మార్కింగ్ చేస్తున్నారు. అయినా కొంతమంది పాటించటం లేదు. ఇది గమనించిన కేంద్రం ఈ కొత్త నియమం తీసుకొచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే నగలకూ హాల్‌మార్క్‌ తప్పనిసరి. వివిధ క్యారట్లపై బంగారం అమ్మకం కాకుండా.. ఇకపై 14, 18, 22 క్యారెట్ల బంగారు నగలు మాత్రమే అమ్ముతారు.

 

 

ప్రతి జువెలరీ షాపులో ఈ మూడు రకాల క్యారెట్ల రేట్లను బోర్డులో చూపించాల్సి ఉంటుంది. ప్రతి కస్టమర్ కు ఇకపై ఒక రేటే చెప్పేందుకే ఈ ఏర్పాటు చేసింది. ప్రజల దగ్గర ఉన్న పాత బంగారానికి హాల్ మార్క్ లేకపోయినా అమ్ముకోవచ్చని కేంద్రం తెలిపింది. దీనికి కొన్న వ్యాపారులు తిరిగి అమ్మేటప్పుడు దాన్ని కరిగించి హాల్ మార్క్ తో నగలు తయారుచేసి అమ్మాల్సి ఉంటుంది. నగలు అమ్మేటప్పుడు ఏ క్యారెట్‌ ప్రకారం అమ్మారో, ఎంత డబ్బు తీసుకున్నారో పూర్తి వివరాలతో సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: