బిజెపికి సంబంధించి రాష్ట్రంలోని కొందరు కీలక నేతలు సమావేశమయ్యారు. తెలుగుదేశంపార్టీ, వైసిపిలకు  ధీటుగా బిజెపి ఎదగాలని చాలా బలంగా తీర్మానించారు. సరే వాళ్ళ తీర్మానం సంగతిని పక్కనపెట్టేస్తే అసలు బిజెపికి అంత సీన్ ఉందా ? అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయగలస్ధాయి ఉన్న నేత కమలంపార్టీలో ఒక్కళ్ళు లేరన్నది అందరికీ తెలిసిన వాస్తవం.

 

తాజా పరిణామామే తీసుకుంటే ఢిల్లీలో కొందరు నేతలు సమావేశమైంది కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇంట్లో. హాజరయ్యింది రాజ్యసభ ఎంపిలు టిజి వెంకటేష్, జివిఎల్ నరసింహారావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. సతీష్, కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్, తెలంగాణా ఎంపి గరికపాటి మోహన్ రావు. 

 

విచిత్రమేమిటంటే హాజరైన నేతల్లో ఒక్కళ్ళకు  కూడా జనాల్లో పట్టులేదు. పట్టుమని పది ఓట్లు కూడా సొంతంగా పార్టీకి వేయించలేరు.  ఒకపుడు టిజి వెంకటేష్ ఎంఎల్ఏగా గెలిచినా ప్రస్తుతానికి  అవుట్ డేటెడ్ నేత అనే చెప్పాలి. మిగిలిన వాళ్ళల్లో ప్రత్యక్షంగా జనాలతో ఎటువంటి సంబంధాలు లేనివారే.  పొరబాటున వీళ్ళు గనుక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేస్తే వీళ్ళుండే వీధిలోని వాళ్ళ ఓట్లు పడేది కూడా డౌటే.

 

ఇటువంటి వాళ్ళంతా కలిసి ఢిల్లీలో సుజనా ఇంట్లో సమావేశం పెడితే ఏమవుతుంది ? ఇక సుజనా, గరికపాటి, టిజి లపై ఆర్ధిక నేరాలు, ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే వాళ్ళలో కొందరికి జనబలం లేకపోయినా ధనబలం మాత్రం విపరీతంగా ఉంది. ఎలాగంటే బ్యాంకులను ముంచి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు కాబట్టి.

 

కాబట్టి వీళ్ళేదో ఢిల్లీలో కూర్చుని ఏపిలో బిజెపిని బలోపేతం చేయాలని తీర్మానించినంత మాత్రాన అయ్యేది లేదు పోయేది లేదు. ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే పార్టీ ఎదగదనే ఇతర పార్టీల నేతలపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. విచిత్రమేమిటంటే ఇతర పార్టీల్లో కూడా గట్టి నేతలు పెద్దగా బిజెపి వైపు చూడటం లేదు. మరి కమలం ఎప్పుడు వికసిస్తోందో ఏమో ?

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: