ఇటీవల కేంద్రం రూపొందించిన అమృత్‌ పథకంలో ఎంపిక చేసిన నగరాలకు  అంచనాలకు మించి నిధులు ఇవ్వడం కుదరదు అని కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి స్పష్టంగా తెలియచేయడం జరిగింది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న లోక్‌సభా సమావేశాల్లో  రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్‌ పాల్కొనడం జరిగింది. 

 

నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో 33 నగరాలు అమృత్‌ పథకానికి ఎంపిక అవ్వడం జరిగింది అని  మంత్రి తెలియచేయడం జరిగింది. ఈ నగరాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్రం రూ.1056.62 కోట్లు కేటాయించడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అడిగిన రూ.872.74 కోట్లు ఇవ్వడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు అని తెలిపారు.

 

Image result for అమృత్‌ పథకం

 


ఇక  ఎక్కువ ప్రతిపాదనలు చేసిన రాష్ట్రాలు ఆ మొత్తాన్ని వారే బాధ్యత తీసుకోవాలని తెలియచేయడం జరిగింది. ఇక  పథకాని సంబంధించి కొన్ని వివరాలు తెలుపుతూ ఇలా ఆంధ్రప్రదేశ్‌లో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలను అమృత్‌లో చేర్చడం వీలుకాదు అని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సమానంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అని తెలియచేయడం జరిగింది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్‌ పథకానికి నగరాలను ఎంపిక చేశామని హర్‌దీప్‌సింగ్‌పురి తెలియచేయడం జరిగింది.

 


ఇక మరో వైపు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం నివారణకు లోక్‌సభలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేసే ఐదు రకాల మొక్కలను నాసా గ్రహించారు, వాటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని తెలిపారు భరత్‌రామ్‌. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని కడి యం మండలంలో దాదాపు 11,500 హెక్టార్లలో నర్సరీలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అని తెలిపారు. పూణే, బెంగళూరు, ముంబయి తదితర ప్రాంతాల్లోని నర్సరీల్లో సాంకేతిక పరిజ్ఞానంతో నూతన మొక్కల అభివృద్ధికి ముందుకు కొనసాగుతున్నాయి అని తెలిపారు. కేంద్ర వ్యవసాయ, ఉద్యానవన మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని  ఎంపీ కోరడం జరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: