పైన ఉన్న ఫోటోలో మగవారి నీచుల రాతలు చూశారా? అబ్బ.. ఏంటీ పిచ్చి రాతలు.. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని ఉద్దేశించి ఒకడేమో.. ' హత్యాచారాలను నేను ప్రోత్సహిస్తున్నా' అని రాస్తాడు.. మరొకడేమో ప్రియాంక రెడ్డి ఫోటో పెట్టి.. 'దీన్ని అత్యాచారం చేసిన వాళ్లు ఎంత అదృష్టవంతులో.. పిల్ల కేక..' అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నాడు.. అసలు ఒక్కసారి సోషల్ మీడియాలో కి వెళ్లి.. ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఈ గడ్డి తినే వెధవలు చేసే వాక్యాలను చదివితే... మగ పుట్టుక మీదే అసహ్యం వేస్తుంది. ఇటువంటి నీచులను ఏం చేయాలి అసలు? ఏబీఎన్ రిపోర్టర్ అయిన నెల్లుట్ల కవిత.. వీరు చేసిన నీచ నికృష్ట కామెంట్లను పోలీసుల వరకు తీసుకెళ్ళింది. అందుకుగాను కవిత గారిని మనం అభినందించాలి.


పోలీసుల నిర్లక్ష్యం సరే, ప్రభుత్వ వైఖరిని పక్కన పెట్టండి, చనిపోయిన ప్రియాంక రెడ్డి పైన నిందలు వేయడాన్ని వదిలేయండి,.. అసహ్యంగా నీచంగా కామెంట్లో చేస్తూ కామ పిచ్చి, పైశాచిక ఆలోచనలో ఉన్నా వారిని ఏం చేయాలి? వారి పశువాంచ ఆలోచన ధోరణి ఎలా మార్చాలి? అంతెందుకు.. నిర్భయను ఘోరంగా హతమార్చిన దుండగులను ఉరితీయ గలిగిందా మన దేశం?


జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు.. 'ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా అని జడ్జి అయిన కోట శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రశ్నించినప్పుడు.. ' దేనికి సార్ భయం.. ఏం చేస్తారు మీరు? మహా అయితే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు.. ఈ కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు సార్... ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నాం సార్.. మరి మీరు వెంటనే శిక్ష వేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్.. తప్పు చేస్తున్నామని మేము ఒప్పుకుంటున్నాం.. రెండు రోజుల్లో మీరు ఉరి తీయగలుగుతారా? మన దేశంలో ఇప్పటివరకు ఉరిశిక్ష పడిన ఖైదీలు 52 మంది ఉన్నారు.. సార్. ఏ సంక్రాంతికొ శివరాత్రికకొ ఒక్కొక్కడిని వేసుకుంటూ పోతే.... మా టోకెన్ నెంబర్ వచ్చే సరికి పాతికేళ్ళు సార్.. ఈ లోపు ఎంతమంది సంధ్యాలు ఎంతమంది దీప్తిలు సార్.. అందుకే సార్ మన దేశం అంటే అంత ఇష్టం నాకు.. ఈ కంట్రీ లో ఉన్న ఫ్రీడం ఎక్కడ ఉండదు సార్' అంటూ మన దేశం విధించే శిక్షలను వ్యంగంగా చెప్తాడు. నిజమే.. అతను చెప్పింది అక్షరాల నిజం.. ప్రస్తుతం మనం ఉన్న వ్యవస్థలో.. ఏ ఖైదీనైనా అసలు శిక్షించగలమా అనే నిస్పృహతో కూడిన ప్రశ్న తలెత్తుతుంది..


ఇటీవల కాలంలో ఒక తొమ్మిది నెలల పాపని తల్లి ఒడిలో నుంచి అపహరించి ఆపై అత్యాచారం హత్య చేసిన నిందితుడికి.. ఉరి శిక్షణను తగ్గించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇదేం న్యాయం? ఇదేం చట్టం.. వెనకబడ్డ కులాలకి చెందిన వాడు కాబట్టి.. ఇంతకు ముందు దొంగతనం తప్ప పెద్ద నేరాలు ఏం చేయలేదు కాబట్టి.. 9 నెలల పాపను ప్రణాళిక ప్రకారం చంపలేదు కాబట్టి... ఉరిశిక్షను తగ్గించి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నామని న్యాయస్థానం వెల్లడించింది.. అటువంటి క్రూరుడిని మన సమాజం వాడు చచ్చేంత వరకు ఎందుకు మేపాలి? అటువంటి వాడిని చంపితే తప్పేముంది??

ఈ న్యాయస్థానాలు, ప్రభుత్వాల గురించి చర్చను పక్కనపెడితే.. మగాళ్ళను ఇలా తయారుచేసే.. సినిమాలను సీరియళ్లను, బూతు కథలను, పోర్న్ వీడియోను ఏం చేయాలి.? వాటిని చూసి మృగాలా కన్నా దారుణంగా మారిన మగాళ్ల ఆలోచన ధోరణని ఎలా మార్చాలి?? ప్రియాంక మరణానికి వెనుక ఆ నలుగురు మృగాలు కాక సమాజంలో యధేశ్చగా లభించే మద్యం, పోర్న్, ఇంకా ఎన్నో ప్రేతాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: