ఉల్లి ధరలు  సామాన్య ప్రజల బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లి  దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లికి  తెగ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ఉల్లిని  కొనుగోలు చేయాలంటే జంకాల్సిన  పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడికి ఉల్లిని  కోయకుండానే  కన్నీళ్లు పెట్టిస్తోంది ఉల్లి ధర. అయితే రోజువారీ ఆహారంలో ఉల్లి ప్రధానమైనది కాబట్టి కొంతమంది సామాన్యులు  లబోదిబోమంటూనే కొనుగోలు చేస్తున్నారు ఇంకా కొంత మంది సామాన్యులు ఉల్లి  లేకుండానే వంటలను వండుకోవడం చేస్తున్నారు. ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నావడం సామాన్యులకు  గుదిబండలా మారిపోయింది. ఉల్లి ధరలు అమాంతం పెరిగి పోవడంతో సామాన్య ప్రజలు ఉల్లి వైపు చూడాలంటేనే వణికిపోతున్నారు. 

 

 

 

 ఉల్లి ధరలు  ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఇరవై ఐదు రూపాయలకే ఉల్లి  అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అటు  బీహార్ రాష్ట్రంలో కూడా ఉల్లిపై బీహార్ ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తోంది. కిలో ఉల్లిని  35 రూపాయలకు విక్రయిస్తున్నది  బీహార్ ప్రభుత్వం. బీహార్ స్టేట్ కార్పొరేషన్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ద్వారా ప్రజలకు ఉల్లిని  విక్రయిస్తున్నారు. 

 

 

 

 అయితే బీహార్లో ఉల్లి ధర నూట పది రూపాయల వరకు పలుకుతుడడంతో కిలో ముప్పై ఐదు రూపాయలకే ప్రభుత్వం అందజేస్తున్నట్లు విషయం తెలియగానే జనాలందరూ కౌంటర్ వద్దకు క్యూ కట్టారు. కాగా  మార్కెట్ దగ్గరికి జనాలందరూ పోటెత్తడంతో ఉల్లి విక్రయదారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ తమకు ఉల్లి దొరకలేదు అన్న ఆగ్రహంతో ఎక్కడ తమపై దాడి చేస్తారనే భయంతో విక్రయదారులు ముందు జాగ్రత్తలో  భాగంగా ఏకంగా హెల్మెట్ పెట్టుకుని మరి ఉల్లిని విక్రయిస్తున్నారు. విక్రయిస్తున్న విక్రయదారుల కు ఎలాంటి సెక్యూరిటీ కల్పించకపోవడంతో ఇలా హెల్మెట్ పెట్టుకుని ఉల్లిని  విక్రయిస్తున్నట్లు బిస్కమౌంట్  అధికారి రోహిత్ కుమార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: