’చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై జరిగిన దాడికి జగన్మోహన్ రెడ్డి, డిజపి గౌతమ్ సవాంగ్ దే బాధ్యత’...ఇది టిడిపి నేతలు చేస్తున్న వితండ వాదం.  చంద్రబాబు కాన్వాయ్ పై మంత్రులే ప్రైవేటు వ్యక్తులతో రాళ్ళేయించినట్లు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ అండ్ కో తీవ్ర ఆరోపణలు చేశారు.

 

నిజానికి తాను అమరావతి ప్రాంతంలో పర్యటించటం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చంద్రబాబుకు బాగా తెలుసు.  తెలిసి కూడా కావాలనే పర్యటన పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే తన పర్యటనలో గొడవలు జరగాలని, జగన్ పై  బురద చల్లటమే చంద్రబాబు టార్గెట్. తన విషయంలో గొడవ జరుగుతుందని తెలుసు కాబట్టే జగన్ పై బురద చల్లంలో భాగంగా జాతీయ మీడియాను బస్సులో వెంటేసుకుని వచ్చారు.

 

సరే తన ప్లాన్ లో చంద్రబాబు ఎంతవరకూ సక్సెస్ అయ్యారన్నది వేరే విషయం. కాన్వాయ్ పై జరిగిన దాడికి జగన్, డిజిపిలు బాధ్యత వహించాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. మరి ఇపుడు చేస్తున్న డిమాండ్ ఆధారంగా అప్పట్లో విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నానికి చంద్రబాబు అప్పటి డిజిపి ఠాకూర్ బాధ్యత వహిస్తారా ?

 

ఇపుడు చంద్రబాబు కాన్వాయ్ మీద దాడి జరగ్గానే నానా యాగీ చేస్తున్న టిడిపి నేతలు, ఎల్లోమీడియా  అప్పుట్లో జగన్ పైనే హత్యాయత్నం జరిగినపుడు ఎందుకు మాట్లాడలేదు ? పైగా తనపై తానే జగన్ హత్యాయత్నం చేయించుకున్నాడంటూ విచిత్రమైన లాజిక్కులు ఎందుకు మాట్లాడారు ? ఒకసారి హత్యాయత్నం జరిగిన ప్రాంతం తమ పరిధిలోనిది రాదన్నారు. బాధ్యత వహించాల్సింది కేంద్రప్రభుత్వమే అన్నారు. మళ్ళీ జగనే హత్యాయత్నం డ్రామా ఆడుతున్నట్లు ఎదురు ఆరోపించారు.

 

అంటే చంద్రబాబు విషయంలో ఒక లాజిక్ ప్రత్యర్ధుల విషయంలో మరొక లాజిక్ వాడాలన్నా తెలివి ఒక్క టిడిపి నేతలకు మాత్రమే ఉందా ?  అప్పట్లో తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో జగన్ ఎక్కడా బహిరంగంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇపుడు చంద్రబాబు కాన్వాయ్ మీద జరిగిన దాడి గురించి ఎక్కడా మాట్లాడలేదు. అప్పుడైనా ఇప్పుడైనా రచ్చ చేస్తోంది చంద్రబాబు, టిడిపి నేతలే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: