యువ నేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ పాలన పగ్గాలు చేపట్టి నేటితో ఆరు నెలలు పూర్తి అయింది. "నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ఏపీ ప్రజలకు భరోసా కలిపిస్తూ పాలన లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ని మరిపిస్తున్నారు మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి" అంటూ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జగన్ ఈ ఆరు నెలల కాలంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారు, ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు.

 

బాబు తీరుతో టీడీపీ లో అసంతృప్తి

 

మరోవైపు బాబు మాత్రం జగన్ ఈ రేంజ్ లో పాలనలో దూసుకుపోతాడని అస్సలు ఊహించలేదట. ఎన్నికల ముందు తాను చూసిన జగన్ వేరు ఇప్పటి జగన్ వేరు అని తెలుగు తమ్ముళ్ళతో అన్నట్లు సమాచారం. జగన్ ఎవ్వరి మాట వినరు మూర్ఖుడు అనే ముద్రను పూర్తిగా చెరిపివేసుకున్నాడు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీ లో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. టీడీపీ నేతలు చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. చాలా మంది టీడీపీ నాయకులు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా బాబు చెప్పినా వినకుండా వల్లభనేని వంశీ పార్టీని వీడారు. ఎంపీ సుజనా చౌదరి సహా నలుగురు రాజ్యసభ సభ్యులు మూకుమ్మడిగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలా మంది నేతలు బీజేపీ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నా బాబు వారిని బుజ్జగిస్తున్నారు.

 

తదుపరి టీడీపీ వారసుడిపైన తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి తో ఉన్నారు. బాబు కి వయసు పైబడడంతో ఇదివరకులా ఆయన చలాకీ గా లేరు. ఇప్పటి నుంచే టీడీపీ తదుపరి వారసుడిని ప్రకటించి మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి పార్టీ ని బలోపేతం చేసి 2024 ఎన్నికల కల్లా పార్టీకి పునర్వైభవం తేవాలని బాబు ని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ బాబు మాత్రం ఎటు తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ ను టీడీపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజల్లోకి తప్పు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని బాబు భావిస్తున్నారట. 

 

40 సంవత్సరాల అనుభవం జగన్ ముందు ఎందుకు పనికి రాకుండా పోతుంది అని టీడీపీ నాయకుల ముందు అన్నట్లు సమాచారం. అమరావతి విషయంలో జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు చెప్పులు, రాళ్లతో దాడి చేసిన ఘటన బాబు ను బాగా గాయ పరిచినట్లు తెలుస్తోంది. ఇటు నాయకులు అటు కార్యకర్తల మధ్య సమన్వయం ఏర్పరచి 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చెయ్యడం బాబుకు కత్తి మీద సాములా మారింది. ఈలోపు టీడీపీలో ఎంత మంది ఉంటారో పెద్ద ప్రశ్నే. 

మరింత సమాచారం తెలుసుకోండి: