వెటర్నిటీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసి అనంతరం అతి దారుణంగా హత్య చేసిన నిందితులను  కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు వైద్యురాలు ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనపై  స్పందించి నిందితులకు  కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితిలో ప్రియాంక రెడ్డి హత్య ఘటనతో నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రియాంక రెడ్డి హత్య నిందితులను ఎన్కౌంటర్ చేయాలని లేకపోతే ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.

 

 

 

 ఇదిలా ఉండగా  వెటర్నిటీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య కేసు శంషాబాద్ డిసిపి  ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కొన్ని వివరాలను వెల్లడించారు. ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య కేసులో కేవలం నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారంటూ డిసిపి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఐదవ  నిందితుడు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులకు సంబంధించి కోర్టులో  అన్ని ఆధారాలు సమర్పిస్తామని... నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని డిసిపి ప్రకాష్ రెడ్డి తెలిపారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండ్ కి తరలిస్తామని  ఆయన తెలిపారు. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు కాసేపట్లో షాద్నగర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 కాగా రోజురోజుకు మహిళలపై  అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్న తరుణంలో  నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఆడపిల్లలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. నెలలు నిండిన పసికందులు నుంచి పండు ముసలి వరకు అందరు కామవాంఛతో ఆడది కనిపిస్తే చాలు  మీద పడి పోతున్నారు మృగాళ్లు . ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు తాజాగా వెటర్నిటీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన కలకలం రేపుతోంది. నలుగురు దుండగులు పథకం ప్రకారమే వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ని అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేయటం   సభ్యసమాజం తలదించుకోవాల్సి ఘటన .

మరింత సమాచారం తెలుసుకోండి: