నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ కార్మిక సంఘానికి రాజ్యానికి రారాజులా వెలిగిన అశ్వత్థామరెడ్డి సమ్మె భారాన్ని తన భూజాల పై మోసి తెలంగాణా ఆర్టీసీ కార్మికులతో పాటుగా, తెలంగాణ ప్రజలకు మరచిపోలేని బహుమతిని ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అసలు ఇలాంటి వారి నాయకత్వంలో నడిచిన కార్మిక సోదరులు 20 మంది వరకు ప్రాణాలు కూడా కోల్పోయారు. నిజంగా తెలంగాణ చరిత్రలో ఈ ఉద్యమ పోరాటం నిలిచిపోయే మరో కధ.

 

 

ఇకపోతే ఆ పోరాటానికి నాయకత్వం వహించిన సింహం ఇప్పుడు ఆర్టీసీలో సాధారణ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తానని అంటుంది. ఆ వివరాలు తెలుసుకుంటే ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం. ఆర్టీసీ కార్మిక నేతలు కూడా ఇక నుంచి సాధారణ కార్మికుల మాదిరి విధులు నిర్వహించాల్సిందేనని తెలుపుతూ ఇప్పటిదాకా వారికి కల్పించిన డ్యూటీ రిలీఫ్‌ హక్కులను యాజమాన్యం రద్దు చేసింది.

 

 

దీనిప్రకారం ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి సహా నేతలంతా డ్యూటీలు చేయాలని పేర్కొంది. ఇకపోతే వీరంతా ఇతర కార్మికుల మాదిరిగానే శుక్రవారం నుంచి విధులకు హాజరు కావాల్సి ఉందని ఒకవేళ హాజరుకాకపోతే గైర్హాజరుగా పరిగణిస్తారని, లేదంటే సెలవుపెట్టుకోవాలని చెప్పారు. ఇక ఇప్పటి వరకు మొత్తం 30 మంది కార్మిక నేతలకు డ్యూటీ మినహాయింపు ఉంది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ)కు చెందిన వారు 26 మంది ఉన్నారట.

 

 

ఇక ఇప్పటికే హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ల తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న టీఎంయూ కార్యాలయాలకూ తాళాలు కనిపించాయి. అధికారిక సంఘానికి కార్యాలయాన్ని కేటాయించటం కొన్నేళ్లుగా వస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటికి తాళం పడింది.  ఇదే కాకుండా కార్మికుల నుంచి యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్‌ పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.

 

 

ఇక ఈ విషయం పై ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ, కార్మిక నేతలకు ఇస్తున్న డ్యూటీ రిలీఫ్‌ను తొలగించడం చిల్లర చర్య అని, అవసరమైతే యూనియన్‌ నేతలమంతా విధుల్లోకి వెళ్తామన్నారు. ‘నేను డ్రైవర్‌ను, డ్యూటీ చేస్తా.. అవసరమైతే సెలవు తీసుకుంటా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు..

మరింత సమాచారం తెలుసుకోండి: